Adhigadhigo Alladhigo - అదిగదిగో అల్లదిగో - Christking - Lyrics

    Adhigadhigo Alladhigo - అదిగదిగో అల్లదిగో

    అదిగదిగో అల్లదిగో
    కల్వరి మెట్టకు దారదిగో
    ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||

    గెత్సేమను ఒక తోటదిగో
    ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
    అచటనే యుండి ప్రార్ధించుడని (2)
    పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో||

    శిష్యులలో ఇస్కరియోతు
    యూదాయను ఒక ఘాతకుడు (2)
    ప్రభువును యూదులకప్పగింప (2)
    పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో||

    లేఖనము నెరవేరుటకై
    ఈ లోకపు పాపము పోవుటకై (2)
    పావనుడేసుని రక్తమును గల (2)
    ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో||

    చలి కాచుకొను గుంపదిగో
    ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
    మూడవసారి బొంకిన వెంటనే (2)
    కొక్కొరొకోయను కూతదిగో (2) ||అదిగదిగో||

    యూదుల రాజువు నీవేనా
    మోదముతో నీవన్నట్లే (2)
    నీలో దోషము కనుగొనలేక (2)
    చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో||

    గొల్గొతా స్థల అద్దరిని
    ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
    సాక్షాత్తు యెహోవా తనయుని (2)
    సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో||

    గొల్లున ఏడ్చిన తల్లదిగో
    ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
    యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
    హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో||

    దాహము గొనుచున్నాననుచు
    ప్రాణము విడిచెను పావనుడు (2)
    పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
    మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||

    =======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

    Adhigadhigo Alladhigo
    Kalvari Mettaku Dhaaradhigo
    Aa Prabhuvunu Vesina Siluvadhigo ||Adhigadhigo||

    Gethsemanu Oka Thotadhigo
    Aa Thotalo Praardhana Sthalamadhigo (2)
    Achatne Yundi Praardhinchudani (2)
    Palikina Kreesthu Maatadhigo (2) ||Adhigadhigo||

    Shishyulalo Iskariyothu
    Yoodhaayanu Oka Ghaathakudu (2)
    Prabhuvunu Yoodhulakappagimpa (2)
    Pettina Donga Muddhadhigo (2) ||Adhigadhigo||

    Lekhanamu Neraverutakai
    Ee Lokapu Paapamu Povutakai (2)
    Paavanudesuni Rakthamunu Gala (2)
    Muppadhi Rooka Mootadhigo (2) ||Adhigadhigo||

    Chali Kaachukonu Gumpadhigo
    Aa Pethuru Bonkina Sthalamadhigo (2)
    Moodavasaari Bonkina Ventane (2)
    Kokkorokoyanu Koothadhigo (2) ||Adhigadhigo||

    Yoodhula Raajuvu Neevenaa
    Modhamutho Neevannatle (2)
    Neelo Dhoshamu Kanugonaleka (2)
    Chethulu Kadigina Pilaathudadugo (2) ||Adhigadhigo||

    Golgothaa Sthala Addharini
    Aa Iddaru Dongala Madhyamuna (2)
    Saakshaatthu Yehovaa Thanayuni (2)
    Siluvanu Vesiri Choodadhigo (2) ||Adhigadhigo||

    Golluna Yedchina Thalladhigo
    Aa Thalliki Cheppina Maatadhigo (2)
    Yoodhula Raajaa Digi Rammanuchu (2)
    Helana Chesina Mookadhigo (2) ||Adhigadhigo||

    Daahamu Gonuchunnaananuchu
    Praanamu Vidichenu Paavanudu (2)
    Parishuddhudu Mana Rakshakudesu (2)
    Mana Madhi Yemo Gamaninchu (2) ||Adhigadhigo||

    Adhigadhigo Alladhigo - అదిగదిగో అల్లదిగో Adhigadhigo Alladhigo - అదిగదిగో అల్లదిగో Reviewed by Christking on July 25, 2018 Rating: 5
    Powered by Blogger.