Aanandamugaa Yehovaa Nee - ఆనందముగా యెహోవా నీ కృపలన్ని : Lyrics 1043 - Christking - Lyrics

    Aanandamugaa Yehovaa Nee - ఆనందముగా యెహోవా నీ కృపలన్ని : Lyrics 1043


    ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
    అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

    చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
    వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
    సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా||

    సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
    ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
    అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||

    ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
    ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
    కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా||

    పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
    తరుణములు విరోధముగపై లేచినా –
    స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||

    Aanandamugaa Yehovaa Nee Krupaalanni
    Anni Kaalambulandu Keerthinchedan (2)

    Chaavu Gothinundi Levaneththi Naaku – Jeevamichchina Jeeva Daatha
    Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
    Savyambugaa Ee Bhuviyanduna ||Aanandamugaa||

    Simhapu Pillalu – Aakaligonina- Yehova Sahaayu Dandariki
    Ihamandunaa Ae Melu Koduva Yundadu
    Aaha! Emandu Nee Vishwaasyathan ||Aanandamugaa||

    Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan
    Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina
    Kanna Thandri Ninnu Koniyaadedan ||Aanandamugaa||

    Parvathambulu – Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo
    Tharunamulu Virodhamuga Pai Lechinaa-
    Smariyincheda Nee Vishwasyathan ||Aanandamugaa||

    Aanandamugaa Yehovaa Nee - ఆనందముగా యెహోవా నీ కృపలన్ని : Lyrics 1043 Aanandamugaa Yehovaa Nee - ఆనందముగా యెహోవా నీ కృపలన్ని : Lyrics 1043 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.