Anni Kaalambula - అన్ని కాలంబుల : Lyrics 1011 - Christking - Lyrics

    Anni Kaalambula - అన్ని కాలంబుల : Lyrics 1011


    అన్ని కాలంబుల – నున్న యెహోవా ని
    నెన్నదరంబయో – కన్న తండ్రి
    వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు
    లున్నతమై యుండ – మున్నె నీకు ||అన్ని||

    నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను
    బన్నుగ జేసిన – బలుడ వీవె
    ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం
    పన్నతతో నేలు – ప్రభుడ వీవె
    అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు
    నున్న సర్వజ్ఞుo – డవు నీవే
    ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల
    సన్నుతించుటకు నే – జాలుదునా ||అన్ని||

    పుట్టింప నీవంచు – బోషింప నీవంచు
    గిట్టింప నీవంచు – గీర్తింతును
    నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే
    పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు
    దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి
    పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు
    గట్టడచే గడ – ముట్టుదనుక నా
    పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు ||అన్ని||

    కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను
    భూరి శుద్ధుడ వీవు – పాపి నేను
    సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న
    దారిద్రుడే లేడు – తరచి చూడ
    సార సద్గుణముల – సంపన్నుడవు నీవు
    ఘోర దుర్గుణ సం – చారి, నేను
    ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు
    నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి ||అన్ని||

    Anni Kaalambula – Nunna Yehovaa Ni
    Nennadarambayo – Kanna Thandri
    Vanne Kekkina Moksha – Vaasaali Sannuthu
    Lunnathamai Yunda – Munne Neeku ||Anni||

    Ninnu Brakatana Seya – Nikhila Lokamulanu
    Bannuga Jesina – Baluda Veeve
    Unna Lokambula – Nudugaka Karunaa Sam
    Pannathatho Nelu – Prabhuda Neeve
    Anni Jeevula Nerigi – Yaahaara Michchuchu
    Nunna Sarvagnun – Davu Neeve
    Enna Shakyamugaaka – Unna Lakshanamula
    Sannuthinchutaku Ne – Jaaludunaa ||Anni||

    Puttimpa Neevanchu – Boshimpa Neevanchu
    Gittimpa Neevanchu – Geerthinthunu
    Natti Paniki Maali – Natti Maanavula Che
    Patti Rakshimpa Baa – dhyunda Vanchu
    Dattamaina Krupanu Dari Jercha Naakichchi
    Pattayu Nilachiyundu – Prabhuda Vanchu
    Gattadache Gada – Muttudanuka Naa
    Pattukoladi Ninnu – Brasthuthinthu ||Anni||

    Kaarunya Nidhi Veevu – Katinaathmudanu Nenu
    Bhoori Shudhdhuda Veevu – Paapi Nenu
    Saara Bhaagyuda Veevu – Jagathilo Naakanna
    Daaridrude Ledu – Tharachi Chooda
    Saara Sadgunamula – Sampannudavu Neevu
    Ghora Durguna Sam – Chaari, Nenu
    Ae Reethi Sthuthiyinthu – Ne Reethi Sevinthu
    Nera Mennaka Prova – Nera Nammithi ||Anni||

    Anni Kaalambula - అన్ని కాలంబుల : Lyrics 1011 Anni Kaalambula - అన్ని కాలంబుల : Lyrics 1011 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.