Enni Maarlu - ఎన్ని మార్లు : Lyrics 1100 - Christking - Lyrics

    Enni Maarlu - ఎన్ని మార్లు : Lyrics 1100


    ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని
    తిన్ననైన మార్గములో నడువకుందువు?
    చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని
    నులివెచ్చని జీవితమును విడువనందువు?

    విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?
    దేనిపై ఉన్నది నీ లక్ష్యము? (2)
    యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…
    ఇంకెందుకు నీకు ఈ రక్షణ? (2) ||ఎన్ని మార్లు||

    యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా
    లోకమెప్పు కోసమే వెరచియున్నావా
    క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే
    ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా
    పాపమే వేరు చేసెను
    దేవుని నుండి మనలనూ
    సిలువ యాగమే దారి చూపెను
    ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ ||విశ్వాసీ||

    పాపానికి జీతము మరణమని తెలిసినా
    ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా
    ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే
    పరలోకం చేరొచ్చనే భ్రమను వీడవా
    చేసిన ప్రతి పాపానికి
    తీర్పు దినం ఉంది మరువకు
    లేదు నీకు నిత్య జీవము
    నీ జీవితం మార్పునొందే వరకు ||విశ్వాసీ||

    Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini
    Thinnanaina Maargamulo Naduvakunduvu?
    Chinnanaati Nundi Neevu Kraisthavudavani
    Nulivechchani Jeevithamunu Viduvananduvu?

    Vishwaasii, Edi Nee Saakshyamu?
    Denipai Unnadi Nee Lakshyamu? (2)
    Yesupaina Lekunte Nee Nireekshana…
    Inkenduku Neeku Ee Rakshana? (2) ||Enni Maarlu||

    Yesu Leni Jeevitham Vyardhamani Thelisinaa
    Lokameppu Kosame Verachiyunnaavaa
    Kreesthu Vaipu Saaguthoo Venuka Thattu Thirigithe
    Uppu Shilaga Migiledavani Marachipoyaavaaa
    Paapame Veru Chesenu
    Devuni Nundi Manalanoo
    Siluva Yaagame Daari Choopenu
    Ikanainaa Maarchuko Nee Manassunoo ||Vishwaasii||

    Paapaaniki Jeethamu Maranamani Thelisinaa
    IhaLoka Snehame Paapamani Erugavaa
    Enni Maarlu Thappinaa Oppukunte Chaalule
    Paralokam Cherochchane Bhramanu Veedavaa
    Chesina Prathi Paapaaniki
    Theerpu Dinam Undi Maruvaku
    Ledu Neeku Nithya Jeevamu
    Nee Jeevitham Maarpunonde Varaku ||Vishwaasii||

    Enni Maarlu - ఎన్ని మార్లు : Lyrics 1100 Enni Maarlu - ఎన్ని మార్లు : Lyrics 1100 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.