Devara Nee Deevenalu - దేవర నీ దీవెనలు : Lyrics 1278 - Christking - Lyrics

    Devara Nee Deevenalu - దేవర నీ దీవెనలు : Lyrics 1278


    దేవర నీ దీవెనలు
    ధారాళముగను వీరలపై
    బాగుగ వేగమే దిగనిమ్ము
    పావన యేసుని ద్వారగను (2)

    దంపతులు దండిగ నీ
    ధాత్రిలో వెలయుచు సంపదలన్
    సొంపుగ నింపుగ పెంపగుచు
    సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||

    ఈ కవను నీ కరుణన్
    ఆకరు వరకును లోకములో
    శోకము లేకయే ఏకముగా
    బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ||

    ఇప్పగిది నెప్పుడును
    గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
    మొప్పిన చొప్పున దప్పకను
    మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ||

    తాపములు పాపములు
    మోపుగ వీరిపై రాకుండగా
    గాపుగ బ్రాపుగ దాపునుండి
    యాపదలన్నియు బాపుచును ||దేవర నీ||

    సాధులుగన్ జేయుటకై
    శోధనలచే నీవు శోధింపగా
    కదలక వదలక ముదమున నీ
    పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ||

    మెండుగ భూమండలపు
    గండములలో వీరుండగను
    తండ్రిగ దండిగ నండనుండి
    వెండియు వానిని ఖండించావే ||దేవర నీ||

    యిద్దరు వీరిద్దరును
    శుద్ధులై నిన్ను సేవించుటకై
    శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
    దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ||

    వాసిగ నీ దాసులము
    చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
    మా సకలేశ్వర నీ సుతుడ
    యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||

    Devara Nee Deevenalu
    Dhaaraalamuganu Veeralapai
    Baaguga Vegame Diganimmu
    Paavana Yesuni Dvaaraganu (2)

    Dampathulu Dandiga Nee
    Dhaathrilo Velayuchu Sampadalan
    Sompuga Nimpuga Pempaguchu
    Sahimpuna Veeru Sukhinchutakai ||Devara Nee||

    Ee Kavanu Nee Karunan
    Aakaru Varakunu Lokamulo
    Shokamu Lekaye Ekamugaa
    Braakatamuganu Jekonumu ||Devara Nee||

    Ippagidi Neppudunu
    Goppagu Prematho Noppuchu Daa
    Moppina Choppuna Dappakanu
    Meppuga Brathukaga Bampu Krupan ||Devara Nee||

    Thaapamulu Paapamulu
    Mopuga Veeripai Raakundagaa
    Gaapuga Braapuga Daapunundi
    Yaapadalanniyu Baapuchunu ||Devara Nee||

    Saadhulugan Jeyutakai
    Shodhanalache Neevu Shodhinpagaa
    Kadalaka Vadalaka Mudamuna Nee
    Paadamu Daapuna Baadukonan ||Devara Nee||

    Menduga Bhoomandalapu
    Gandamulalo Veerundaganu
    Thandriga Dandiga Nandanundi
    Vendiyu Vaanini Khandinchave ||Devara Nee||

    Iddara Veeriddarunu
    Shudhdhulai Ninnu Sevinchutakai
    Shradhdhatho Budhdhiga Sidhdhapadan
    Didhdhumu Nee Priya Biddalugaan ||Devara Nee||

    Vaasiga Nee Daasulamu
    Chesina Ee Moral Deesikoni
    Maa Sakaleshwara Nee Suthuda
    Yesuni Perita Brovumaamen ||Devara Nee||

    Devara Nee Deevenalu - దేవర నీ దీవెనలు : Lyrics 1278 Devara Nee Deevenalu - దేవర నీ దీవెనలు : Lyrics 1278 Reviewed by Christking on July 04, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.