Dinadinambu Yesuku - దినదినంబు యేసుకు : Lyrics 1272 - Christking - Lyrics

    Dinadinambu Yesuku - దినదినంబు యేసుకు : Lyrics 1272


    దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
    అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2)

    ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2)
    పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు||

    మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2)
    మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు||

    ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2)
    ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు||

    దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2)
    ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు||

    పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2)
    సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||

    Dinadinambu Yesuku Daggaragaa Cheruthaa
    Anukshanambu Yesune Naa Madilo Koruthaa (2)

    Ellappudu Yesu Vaipu Kannuletthi Paaduthaa (2)
    Parama Thandri Needu Maata Balamu Thoda Chaatuthaa (2) ||Dinadinambu||

    Maaripoye Lokamandu Manujulentho Maarinaa (2)
    Maarunaa Prabhu Yesu Prema Aasha Thoda Cheranaa (2) ||Dinadinambu||

    Ennadu Edabaayadu Nannu Viduvadu Ae Maathramu (2)
    Prabhuve Naaku Abhayamu Bhayapadanu Nene Maathramu (2) ||Dinadinambu||

    Daiva Vaakyam Jeeva Vaakyam Anudinambu Chaduvuthaa (2)
    Prabhuvu Maata Naadu Baata Vibhunitho Maatlaaduthaa (2) ||Dinadinambu||

    Parishuddhamugaa Anukoolamugaa Jeevayaagamai Nilachedaa (2)
    Siluva Mosi Seva Cheya Yesuthone Kaduluthaa (2) ||Dinadinambu||

    Dinadinambu Yesuku - దినదినంబు యేసుకు : Lyrics 1272 Dinadinambu Yesuku - దినదినంబు యేసుకు : Lyrics 1272 Reviewed by Christking on July 04, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.