Kalvari Giripai Siluva - కల్వరి గిరిపై సిలువ భారం - Christking - Lyrics

    Kalvari Giripai Siluva - కల్వరి గిరిపై సిలువ భారం

    కల్వరి గిరిపై సిలువ భారం
    భరించితివా ఓ నా ప్రభువా
    నా పాపముకై నీ రక్తమును
    సిలువ పైన అర్పించితివా (2)

    దుష్టుండనై బల్లెము బూని
    గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
    కేక వేసి నీదు ప్రాణం
    సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి||

    మూడు దినములు సమాధిలో
    ముదము తోడ నిద్రించితివా (2)
    నా రక్షణకి సజీవముతో
    సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి||

    ఆరోహణమై వాగ్ధానాత్మన్
    సంఘము పైకి పంపించితివా (2)
    నీ రాకడకై నిరీక్షణతో
    నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||

    =======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

    Kalvari Giripai Siluva Bhaaram
    Bharinchithivaa O Naa Prabhuvaa
    Naa Paapamukai Nee Rakthamunu
    Siluva Paina Arpinchithivaa (2)

    Dushtundanai Ballemu Booni
    Gruchchithi Thandri Prakkalona (2)
    Keka Vesi Needhu Praanam
    Siluva Paina Arpinchithivaa (2) ||Kalvari||

    Moodu Dinamul Samaadhilo
    Mudhamu Thoda Nidrinchithivaa (2)
    Naa Rakshanaki Sajeevamutho
    Samaadhin Gelchi Lechina Thandri (2) ||Kalvari||

    Aarohanamai Vaagdhaanaathman
    Sanghamu Paiki Pampinchithivaa (2)
    Nee Raakadakai Nireekshanatho
    Nindhalanella Bharinchedhanu (2) ||Kalvari||

    Kalvari Giripai Siluva - కల్వరి గిరిపై సిలువ భారం Kalvari Giripai Siluva - కల్వరి గిరిపై సిలువ భారం Reviewed by Christking on July 26, 2018 Rating: 5
    Powered by Blogger.