Priya Yesu Mana Koraku - ప్రియ యేసు మన కొరకు - Christking - Lyrics

    Priya Yesu Mana Koraku - ప్రియ యేసు మన కొరకు

    ప్రియ యేసు మన కొరకు
    ప్రేమతో పొందిన శ్రమలు
    కాంచగ కల్వరి దృశ్యం
    కారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు||

    కల్వరి కొండపైన
    దొంగాల మధ్యలోన
    సిల్వలోన వ్రేలాడెను
    నాకై యేసు మరణించెను (2) ||ప్రియ యేసు||

    ముండ్లతో అల్లిన మకుటం
    జల్లాటమున పెట్టగా
    స్రవించె పరిశుద్ధ రక్తం
    ద్రవించె నా హృదయం (2) ||ప్రియ యేసు||

    పాపాంధకారములో
    పయనించు మనుజులను
    పావనులుగా చేయుటకు
    పావనుడేసు మరణించెను (2) ||ప్రియ యేసు||

    పాపినైన నా కొరకు
    ప్రేమించి ప్రాణమిచ్చెను
    సిల్వలో వ్రేళాడెను
    నీకై ప్రాణమునిచ్చెను (2) ||ప్రియ యేసు||

    =======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

    Priya Yesu Mana Koraku
    Prematho Pondina Shramalu
    Kaanchaga Kalvari Drushyam
    Kaarenu Kallalo Rudhiram (2) ||Priya Yesu||

    Kalvari Kondapaina
    Dongala Madhyalona
    Silvalona Vrelaadenu
    Naakai Yesu Maraninchenu (2) ||Priya Yesu||

    Mundlatho Allina Makutam
    Jallaatamuna Pettagaa
    Sravinche Parishuddha Raktham
    Dravinche Naa Hrudayam (2) ||Priya Yesu||

    Paapaandhakaaramulo
    Payaninchu Manujulanu
    Paavanulugaa Cheyutaku
    Paavanudesu Maraninchenu (2) ||Priya Yesu||

    Paapinaina Naa Koraku
    Preminchi Praanamichchenu
    Silvalo Vrelaadenu
    Neekai Praanamunichchenu (2) ||Priya Yesu||

    Priya Yesu Mana Koraku - ప్రియ యేసు మన కొరకు Priya Yesu Mana Koraku - ప్రియ యేసు మన కొరకు Reviewed by Christking on July 26, 2018 Rating: 5
    Powered by Blogger.