Siluvalo Nee Prema - సిలువలో నీ ప్రేమ - Christking - Lyrics

    Siluvalo Nee Prema - సిలువలో నీ ప్రేమ

    సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
    మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
    ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
    నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో||

    తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
    నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
    నను విడిపించుటకు – విలువను విడిచితివి
    పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని||

    దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
    కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
    నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
    మరణము దాటుటకు – బలిగా మారితివి (2) ||ఘోర పాపిని||

    అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
    పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
    నిను చాటించుటకు – వెలుగై సాగెదను
    ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2) ||ఘోర పాపిని||

    =======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

    Siluvalo Nee Prema – Paapamu Theesenayyaa
    Maranamu Cheralo Nundi – Nanu Vidipinchenayyaa (2)
    Ghora Paapini Nenu – Parishuddhuni Chesithivi
    Nithya Jeevamulo Nannu – Niluputaku Bali Aithivi (2) ||Siluvalo||

    Thaalaleni Nee Thaapam – Tholaginchenu Naadhu Shaapam
    Naliginatti Nee Roopam – Ichchenu Naaku Swaroopam (2)
    Nanu Vidipinchutaku – Viluvanu Vidichithivi
    Paramunu Cherchutaku – Mahimanu Marichithivi (2) ||Ghora Paapini||

    Daiva Thanayuni Deham – Mosindi Cheyani Neram
    Kadigendhuku Naa Dosham – Chindinche Niluvunaa Rudhiram (2)
    Nanu Kaapaadutaku – Rottegaa Virigithivi
    Maranamu Dhaatutaku – Baligaa Maarithivi (2) ||Ghora Paapini||

    Adhamudainatti Nenu – Nee Prema Arhudanu Kaanu
    Pogidi Ninnu Prathi Kshanamu – Theerchalenu Nee Runamu (2)
    Ninu Chaatinchutaku – Velugai Saagedhanu
    Premanu Panchutakai – Uppuga Nilichedhanu (2) ||Ghora Paapini||

    Siluvalo Nee Prema - సిలువలో నీ ప్రేమ Siluvalo Nee Prema - సిలువలో నీ ప్రేమ Reviewed by Christking on July 25, 2018 Rating: 5
    Powered by Blogger.