Hosannanuchu Sthuthi Paaduchu - హోసన్ననుచూ స్తుతి పాడుచ - Christking - Lyrics

    Hosannanuchu Sthuthi Paaduchu - హోసన్ననుచూ స్తుతి పాడుచ


    హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
    హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ||

    ఈ లోకయాత్రలో బాటసారులం
    ఈ జీవన కడలిలో పరదేశులం (2)
    క్షణభంగురం ఈ క్షయ జీవితం
    అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా||

    మన్నయిన ఈ దేహం మహిమరూపమై
    ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
    నాధుడేసుకు నవ వధువులము
    నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా||

    ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
    చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
    ఆకలి లేదు దప్పిక లేదు
    ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||

    Hosannanuchu Sthuthi Paaduchu Seeyonuku Cheredam (2)
    Hosannaa.. Hosannaa.. (2) ||Hosannanuchu||

    Ee Lokayaathralo Baatasaarulam
    Ee Jeevana Kadalilo Paradeshulam (2)
    Kshana Bhanguram Ee Kshaya Jeevitham
    Akshaya Nagaram Manaku Shaashwatham (2) ||Hosannaa||

    Mannayina Ee Deham Mahima Roopamai
    Davala Varna Vasthramulu Dhariyinchedamu (2)
    Naadhudesuku Nava Vadhuvulamu
    Neethi Paalanalona Yuva Raanulamu (2) ||Hosannaa||

    Prathi Baashpa Binduvunu Thudichiveyunu
    Chinthalanni Theerchi Chentha Niluchunu (2)
    Aakali Ledu Dappika Ledu
    Aahaa Mana Yesutho Nithyamaanandam (2) ||Hosannaa||
    Hosannanuchu Sthuthi Paaduchu - హోసన్ననుచూ స్తుతి పాడుచ Hosannanuchu Sthuthi Paaduchu - హోసన్ననుచూ స్తుతి పాడుచ Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.