Hrudayamanedu Thalupu Nodda - హృదయమనెడు తలుపు నొద్ - Christking - Lyrics

    Hrudayamanedu Thalupu Nodda - హృదయమనెడు తలుపు నొద్


    హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
    నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||

    పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
    నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||

    కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
    యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ||

    ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
    నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||

    అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
    మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ||

    జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
    మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ||

    సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
    తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ||

    చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
    నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ||

    అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
    మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ||

    బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
    గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||

    Hrudayamanedu Thalupu Nodda – Yesu Naathundu
    Nilachi – Sadayudaguchu Dattuchundu – Sakala Vidhamulanu (2) ||Hrudaya||

    Paruni Boli Niluchunnaadu – Parikinchi Chooda
    Nathadu – Parudu Gaadu Rakshakundu – Praana Snehithudu (2) ||Hrudaya||

    Karunaa Sheelundathadu Gaana – Gaachi Yunnaadu
    Yesu – Karuna Nerigi Gaaravimpa – Garamu Nyaayambu (2) ||Hrudaya||

    Entha Sepu Niluva Betti – Yedpinthu Rathani
    Naatha – Dentho Dayache Biluchuchunnaa – Dippudu Mimmulanu (2) ||Hrudaya||

    Athadu Mithrudathadu Mithrun – Dakhila Paapulaku
    Meera – Lathani Pilupu Vinti Reni – Yathadu Priyudagunu (2) ||Hrudaya||

    Jaali Chetha Dana Hasthamula – Jaaapi Yunnaadu
    Mimmu – Naalinganamu Seya Gori – Yanishamu Kanipettu (2) ||Hrudaya||

    Saatileni Dayagala Vaadu – Sarveshu Suthudu
    Thana – Maata Vinedu Vaarala Nella – Sootiga Rakshinchu (2) ||Hrudaya||

    Cherchukonudi Mee Hrudayamuna – Shree Yesunaathu
    Nathadu – Cherchukonuchu Mee Kichchunu – Chira Jeevamu Krupanu (2) ||Hrudaya||

    Athadu Thappaka Kalugajeyu – Nakhila Bhaagyamulu
    Meera – Lathani Haththukondu Rappu – Daanandamu Thoda (2) ||Hrudaya||

    Brathuku Shaashwathambu Kaadu – Parikinchu Choodu
    Gaana – Brathiki Yundu Kaalamunane – Prabhuni Goluvandi (2) ||Hrudaya||
    Hrudayamanedu Thalupu Nodda - హృదయమనెడు తలుపు నొద్ Hrudayamanedu Thalupu Nodda - హృదయమనెడు తలుపు నొద్ Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.