Adiginadi Konthe Ainaa - అడిగినది కొంతే అయినా : Lyrics 1003 - Christking - Lyrics

    Adiginadi Konthe Ainaa - అడిగినది కొంతే అయినా : Lyrics 1003


    అడిగినది కొంతే అయినా
    పొందినది ఎంతో దేవా
    ప్రతిగా ఏమివ్వగలనయ్యా
    నిను స్తుతియించే హృదయము తప్ప
    నా జీవితం నీకే అంకితమయ్యా ||అడిగినది||

    ఊహించలేని వివరింపజాలని
    నీ కార్యములు ఆశ్చర్యమే
    యోచించినా నా వర్ణనకందని
    నీ కృపా కనికరములు అత్యున్నతమే (2)
    తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
    యుగయుగములకు నీకే ఘనతా మహిమా
    సతతం నిను నే కొనియాడెదను
    సకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది||

    క్షణ భంగురం నా క్షయ జీవితం
    కాచావయ్యా నను నీ రెక్కల నీడ
    ఏ యోగ్యత లేని అల్పుడను నన్ను
    హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ (2)
    నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
    నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
    నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
    ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది||

    మహిమోన్నతుడా నను మరువని విభుడా
    ప్రణుతించెదను నిన్నే నిరతం
    నిష్కలంకుడా నిర్మలాత్ముడా
    ప్రచురించెదను నీ పావన చరితం (2)
    నా అతిశయము నీవే నా యేసయ్యా
    నా ఆధారము నీవే నా మెస్సయ్యా
    నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
    ఈ దీనుని సేవను చేకొనుమయ్యా ||అడిగినది||

    Adiginadi Konthe Ainaa
    Pondinadi Entho Devaa
    Prathigaa Emivvagalanayyaa
    Ninu Sthuthiyinche Hrudayamu Thappa
    Naa Jeevitham Neeke Ankithamayyaa ||Adiginadi||

    Oohinchaleni Vivarimpajaalani
    Nee Kaaryamulu Aascharyame
    Yochinchinaa Naa Varnanakandani
    Nee Krupaa Kanikaramulu Athyunnathame (2)
    Tharatharamulaku Maarani Nee Unnatha Premaa
    Yugayugamulaku Neeke Ghanatha Mahimaa
    Sathatham Ninu Ne Koniyaadedanu
    Sakalam Nee Naamamuke Sthothramu Thagunu ||Adiginadi||

    Kshana Bhanguram Naa Kshaya Jeevitham
    Kaachaavayyaa Nanu Nee Rekkala Needa
    Ae Yogyatha Leni Alpudanu Nannu
    Hechchinchaavayyaa Nee Prema Thoda (2)
    Naa Aashraya Durgamu Neeve Yesayya
    Naa Rakshana Shrungamu Neeve Messaiah
    Naa Sthuthiki Paathrudavu Neevenayyaa
    Ee Sthothra Keerthana Neekenayyaa ||Adiginadi||

    Mahimonnathudaa Nanu Maruvani Vibhudaa
    Pranuthinchedanu Ninne Niratham
    Nishkalankudaa Nirmalaathmudaa
    Prachurinchedanu Nee Paavana Charitham (2)
    Naa Athishayamu Neeve Naa Yesayyaa
    Naa Aadhaaramu Neeve Naa Messaiah
    Naa Aaraadhana Aalaapana Neekenayya
    Ee Deenuni Sevanu Chekonumayyaaa ||Adiginadi||

    Adiginadi Konthe Ainaa - అడిగినది కొంతే అయినా : Lyrics 1003 Adiginadi Konthe Ainaa - అడిగినది కొంతే అయినా : Lyrics 1003 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.