Amoolya Rakthamu Dwaaraa - అమూల్య రక్తము ద్వారా : Lyrics 1020 - Christking - Lyrics

    Amoolya Rakthamu Dwaaraa - అమూల్య రక్తము ద్వారా : Lyrics 1020


    అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
    సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
    ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

    మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)
    చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య||

    చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)
    నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య||

    నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)
    స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య||

    కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)
    ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య||

    తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)
    మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య||

    పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
    కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య||

    మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)
    మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||

    Amoolya Rakthamu Dwaaraa Rakshana Pondina Janulaaraa
    Sarva Shakthuni Prajalaaraa Parishudhdhulaaraa Paadedamu
    Ghanatha Mahima Sthuthulanu Parishudhdhulaaraa Paadedamu

    Mana Yavvana Jeevithamul – Shareeraashaku Lobarachi (2)
    Chedu Maatalanu Palukuchu – Shaanthi Leka Yuntimigaa (2) ||Amoolya||

    Chedu Maargamuna Pothimi – Daani Yanthamu Maranamu (2)
    Naraka Shikshaku Lobaduchu – Paapapu Dhanamu Pondithimi (2) ||Amoolya||

    Nithya Sathya Devuni – Naamamuna Moralidaka (2)
    Swantha Neethi Thodane – Devuni Raajyamu Korithimi (2) ||Amoolya||

    Kanikaramugala Devudu – Maanavaroopamu Daalchenu (2)
    Praanamu Siluvanu Balijesi – Manala Vimochinchenu (2) ||Amoolya||

    Thana Raktha Dhaaralalo – Mana Paapamulanu Kadigi (2)
    Mana Kannulanu Therachi – Manala Nimpenu Gnaanamutho (2) ||Amoolya||

    Paapulamaina Mana Meeda – Thana Yaascharya Ghana Prema (2)
    Kummarinchenu Mana Prabhuvu – Kruthagnatha Chellinthumu (2) ||Amoolya||

    Mana Rakshakuni Sthuthinchedamu – Manalanu Jesenu Dhanyulugaa (2)
    Mana Devuni Karpinchedamu – Jeevaathma Shareeramulan (2) ||Amoolya||

    Amoolya Rakthamu Dwaaraa - అమూల్య రక్తము ద్వారా : Lyrics 1020 Amoolya Rakthamu Dwaaraa - అమూల్య రక్తము ద్వారా : Lyrics 1020 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.