Anthe Leni Nee Prema Dhaara - అంతే లేని నీ ప్రేమ ధార : Lyrics 1025 - Christking - Lyrics

    Anthe Leni Nee Prema Dhaara - అంతే లేని నీ ప్రేమ ధార : Lyrics 1025


    అంతే లేని నీ ప్రేమ ధార
    ఎంతో నాపై కురిపించినావు
    వింతైన నీ ప్రేమ కొంతైన గాని
    కాంతింప కృప నాకు చూపించినావు (2)
    ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
    పొందేటందుకు నే యోగ్యుడను కాను
    అంతో ఇంతో ఆ ప్రేమను నేను
    పంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే||

    పరిశుద్ధుడు పరిశుద్ధుడు
    అని దూతలతో పొగడబడే దేవా
    పదివేలలో అతి సుందరుడా
    నీవేగా అతి కాంక్షనీయుడా (2)
    నా దోషములకై ఆ కలువరి సిలువలో
    బలియాగమైనావ దేవా (2)
    పంతముతో నే చేసిన నా పాపములన్ని
    శాంతముతో సహియించి క్షమియించినావు
    సొంతముగా నిను వీడి నే పారిపోగా
    నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు ||అంతే||

    ఏమున్నదీ నాలో దేవా
    మంచన్నదే లేనే లేదు
    అయినా నీవు నను రక్షించి
    నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
    అర్హుడనే కాను నీ పేరు పిలువ
    అర్హునిగా నను మార్చినావా (2)
    ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
    నా జీవితమంతయును నీ కొరకే దేవా
    నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
    ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు ||అంతే||

    Anthe Leni Nee Prema Dhaara
    Entho Naapai Kuripinchinaavu
    Vinthaina Nee Prema Konthaina Gaani
    Kaanthimpa Krupa Naaku Choopinchinaavu (2)
    Entho Entho Nee Prema Entho
    Pondetanduku Ne Yogyudanu Kaanu
    Antho Intho Aa Premanu Nenu
    Panchetanduku Nee Bhaagyamu Pondaanu ||Anthe||

    Parishuddhudu Parishuddhudu
    Ani Doothalatho Pogadabade Devaa
    Padivelalo Athi Sundarudaa
    Neevegaa Athi Kaankshaneeyudaa (2)
    Naa Doshamulakai Aa Kaluvari Siluvalo
    Baliyaagamainaava Devaa (2)
    Panthamutho Ne Chesina Naa Paapamulanni
    Shaanthamutho Sahiyinchi Kshamiyinchinaavu
    Sonthamugaa Ninu Veedi Ne Paaripogaa
    Nee Raajyamunaku Cherchaga Vanthena Ainaavu ||Anthe||

    Emunnadi Naalo Devaa
    Manchannade Lene Ledu
    Ainaa Neevu Nanu Rakshinchi
    Nee Saakshiga Nilipaavu Ilalo (2)
    Arhudane Kaanu Nee Peru Piluva
    Arhunigaa Nanu Maarchinaavaa (2)
    Emivvagalanayyaa Nee Premaku Badulu
    Naa Jeevithamanthayunu Nee Korake Devaa
    Nee Sevalo Nenu Konasaagedanayyaa
    Prakatinthu Nee Prema Thudi Shwaasa Varaku ||Anthe||

    Anthe Leni Nee Prema Dhaara - అంతే లేని నీ ప్రేమ ధార : Lyrics 1025 Anthe Leni Nee Prema Dhaara - అంతే లేని నీ ప్రేమ ధార : Lyrics 1025 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.