Choochuchunnaamu Nee Vaipu - చూచుచున్నాము నీ వైపు : Lyrics 1226 - Christking - Lyrics

    Choochuchunnaamu Nee Vaipu - చూచుచున్నాము నీ వైపు : Lyrics 1226


    చూచుచున్నాము నీ వైపు
    మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
    చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
    జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు||

    మేమరులమై యుంటిమి
    మార్గము వీడి – మేమందరము పోతిమి
    ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
    క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు||

    నిను నమ్ము పాపులకు
    వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
    ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
    గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు||

    నీ భయము మాయెదలను
    నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
    నీ భయముచే మేము – వైభవ మొందుచు
    నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||

    దయ జూచి మము నెప్పుడు
    మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
    దయచేయరానివి – దయచేయుమని కోర
    దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||

    Choochuchunnaamu Nee Vaipu
    Maa Priya Janaka – Choochuchunnaamu Nee Vaipu
    Choochuchu Nee Prema – Sompu Suvaarthanu
    Jaachuchu Garamulu – Chakkagaa Neevaipu ||Choochu||

    Memarulamai Yuntimi
    Maargamu Veedi – Memandaramu Pothimi
    Premache Nappudu – Priya Thanayu Nampinchi
    Kshema Maargamu Maaku – Bremanu Joopithivi ||Choochu||

    Ninu Nammu Paapulaku
    Vaarevaraina – Nee Sharamu Jochchuvaaralaku
    Inudavu Kedembu – Nee Jagathilo Naguchu
    Ganuparachuchunduvu – Ghanamaina Nee Krupa ||Choochu||

    Nee Bhayamu Maayedalanu
    Nilupumu Needu – Praabhava Monaranganu
    Nee Bhayamuche Memu – Vaibhava Monduchu
    Ne Bhayamu Lekunda – Nee Bhuvini Gonnaallu ||Choochu||

    Daya Joochi Mamu Neppudu
    Manchivi Yanni – Dayacheyu Mellappudu
    Dayacheyaraanivi – Dayacheyumani Kora
    Daya Joopi Manninchu – Dayagala Maa Thandri ||Choochu||

    Choochuchunnaamu Nee Vaipu - చూచుచున్నాము నీ వైపు : Lyrics 1226 Choochuchunnaamu Nee Vaipu - చూచుచున్నాము నీ వైపు : Lyrics 1226 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.