Enthati Vaadanu Nenu - ఎంతటి వాడను నేను యేసయ్యా : Lyrics 1119 - Christking - Lyrics

    Enthati Vaadanu Nenu - ఎంతటి వాడను నేను యేసయ్యా : Lyrics 1119


    ఎంతటి వాడను నేను యేసయ్యా
    కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
    ఇంతగ నను హెచ్చించుటకు
    ఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి||

    ఐశ్వర్యము గొప్పతనమును
    కలిగించు దేవుడవీవే
    హెచ్చించువాడవును
    బలమిచ్చువాడవు నీవే (2)
    అల్పుడను మంటి పురుగును
    నన్ను ప్రేమించినావు
    ప్రాణమును నీ సర్వమును
    నా కొరకై అర్పించినావు ||ఎంతటి||

    నిను వెంబడించువారిని
    నిజముగ సేవించువారిని
    నీవుండే స్థలములలో
    నిలిచే నీ సేవకుని (2)
    ఎంతో ఘనపరచెదవు
    ఆశీర్వదించెదవు
    శత్రువుల కంటె ఎత్తుగా
    అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||

    వినయముగల మనుష్యులను
    వర్దిల్లజేసెదవు
    గర్విష్టుల గర్వమునణచి
    గద్దె నుండి దించెదవు (2)
    మాదు ఆశ్రయ దుర్గమా
    మేమంతా నీ వారమే
    మా శైలము మా కేడెమా
    మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||

    Enthati Vaadanu Nenu Yesayyaa
    Konthainaa Yogyudanu Kaanayyaa (2)
    Inthaga Nanu Hechchinchutaku
    Ee Sthithilo Nannunchutaku (2) ||Enthati||

    Aishwaryamu Goppathanamunu
    Kaliginchu Devudaveeve
    Hechchinchuvaadavunu
    Balamichchuvaadavu Neeve (2)
    Alpudanu Manti Purugunu
    Nannu Preminchinaavu
    Praanamunu Nee Sarvamunu
    Naa Korakai Arpinchinaavu ||Enthati||

    Ninu Vembadinchuvaarini
    Nijamuga Sevinchuvaarini
    Neevunde Sthalamulalo
    Niliche Nee Sevakuni (2)
    Entho Ghanaparachedavu
    Aasheervadinchedavu
    Shathruvula Kante Eththugaa
    Athani Thalanu Paikeththedavu ||Enthati||

    Vinayamugala Manushyulanu
    Vardhillajesedavu
    Garvishtula Garvamunanachi
    Gadde Nundi Dinchedavu (2)
    Maadu Aashraya Durgamaa
    Memanthaa Nee Vaarame
    Maa Shailamu Maa Kedemaa
    Maakunnadantha Nee Daaname ||Enthati||

    Enthati Vaadanu Nenu - ఎంతటి వాడను నేను యేసయ్యా : Lyrics 1119 Enthati Vaadanu Nenu - ఎంతటి వాడను నేను యేసయ్యా : Lyrics 1119 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.