Gaalinchi Choodaraa - గాలించి చూడరా మేలైనది : Lyrics 1206 - Christking - Lyrics

    Gaalinchi Choodaraa - గాలించి చూడరా మేలైనది : Lyrics 1206


    గాలించి చూడరా మేలైనది
    నీలోన ఉన్నదా ప్రేమన్నది
    ప్రేమన్నది నీ పెన్నిధి (2)
    నీలోన ఉన్నదా ప్రేమన్నది (2)

    దేవ దూతలా భాషలు దేనికి
    కరుణ లేని నీ కఠిన ముఖానికి (2)
    పైకి భక్తి కలిగినా చాలదు
    ప్రేమ లేని భక్తి అది వ్యర్ధము (2) ||గాలించి||

    బీదలకు ఆస్తినిచ్చి పంచినా
    కార్చుటకు శరీరం మార్చినా (2)
    రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినా
    రిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము (2) ||గాలించి||

    కొండలు పెకిలించు విశ్వాసివా
    గుండెలు కరిగించు సహవాసివా (2)
    ప్రేమలేని విశ్వాసము వ్యర్ధము
    చివరికది మరో మృతము తథ్యము (2) ||గాలించి||

    స్వస్థపరచు వరాలున్న దేనికి
    స్వస్థతయే లేదు నీకు నేటికీ (2)
    ప్రేమలేని వరాలున్న సున్నా
    క్షేమమేదిరా నీకు రన్నా (2) ||గాలించి||

    గణ గణ మ్రోగెడి లోహానివా
    కంచువై మ్రోగెడి మేళానివా (2)
    డంబమెరుగదు మోగదు మేలిమి
    పొంగదు ప్రేమ ఋణము తాలిమి (2) ||గాలించి||

    Gaalinchi Choodaraa Melainadi
    Neelona Unnadaa Premannadi
    Premannadi Nee Pennidhi (2)
    Neelona Unnadaa Premannadi (2)

    Deva Doothalaa Bhaashalu Deniki
    Karuna Leni Nee Katina Mukhaaniki (2)
    Paiki Bhakthi Kaliginaa Chaaladu
    Prema Leni Bhakthi Adi Vyardhamu (2) ||Gaalinchi||

    Beedalaku Aasthinichchi Panchinaa
    Kaarchutaku Shareeram Maarchinaa (2)
    Reyi Pagalu Edchuchu Praardhinchinaa
    Rikthudave Nee Shramantha Vyardhamu (2) ||Gaalinchi||

    Kondalu Pekilinchu Vishwaasivaa
    Gundelu Kariginchu Sahavaasivaa (2)
    Premaleni Vishwaasamu Vyardhamu
    Chivarikadi Maro Mruthamu Thathyamu (2) ||Gaalinchi||

    Swasthaparachu Varaalunna Deniki
    Swasthathaaye Ledu Neeku Netiki (2)
    Premaleni Varaalunna Sunnaa
    Kshemamediraa Neeku Rannaa (2) ||Gaalinchi||

    Gana Gana Mrogedi Lohaanivaa
    Kanchuvai Mrogedi Melaanivaa (2)
    Dambamerugadu Mogadu Melimi
    Pongadu Prema Runamu Thaalimi (2) ||Gaalinchi||

    Gaalinchi Choodaraa - గాలించి చూడరా మేలైనది : Lyrics 1206 Gaalinchi Choodaraa - గాలించి చూడరా మేలైనది : Lyrics 1206 Reviewed by Christking on June 23, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.