Gamyam Cheraalani - గమ్యం చేరాలని నీతో ఉండాలని : Lyrics 1201 - Christking - Lyrics

    Gamyam Cheraalani - గమ్యం చేరాలని నీతో ఉండాలని : Lyrics 1201


    గమ్యం చేరాలని నీతో ఉండాలని
    పగలూ రేయి పరవశించాలని
    ఈ నింగి నేలా కనుమరుగైనా
    శాశ్వత జీవం పొందాలని
    సాగిపోతున్నాను నిన్ను చూడాలని
    నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||

    భువి అంతా తిరిగి జగమంతా నడచి
    నీ జ్ఞానముకు స్పందించాలని
    నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
    నీ ప్రేమ ఎంతో కొలవాలని
    అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
    అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||

    అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
    శిరమును వంచి సహించాలని
    వేదన బాధలు గుండెను పిండినా
    నీదు సిలువనే మోయాలని
    నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
    నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||

    Gamyam Cheraalani Neetho Undaalani
    Pagaluu Reyi Paravashinchaalani
    Ee Ningi Nela Kanumarugainaa
    Shaashwatha Jeevam Pondaalani
    Saagipothunnaanu Ninnu Choodaalani
    Nirekshisthunnaanu Ninnu Cheraalani (2) ||Gamyam Cheraalani||

    Bhuvi Anthaa Thirigi Jagamanthaa Nadachi
    Nee Gnaanamuku Spandinchaalani
    Naakunnavanni Samastham Vechchinchi
    Nee Prema Entho Kolavaalani
    Adi Entha Eththuna Undo – Adi Entha Lothuna Undo
    Adi Ae Roopamlo Undo – Adi Ae Maatallo Undo ||Saagipothunnaanu||

    Alalenno Reginaa Shramalenno Vachchinaa
    Shiramunu Vanchi Sahinchaalani
    Vedana Bhaadhalu Gundenu Pindinaa
    Needu Siluvane Moyaalani
    Naa Gunde Kovelalonaa – Ninne Ne Prathishtinchi
    Nee Sevalone Ilalo – Naa Thudi Shwaasanu Vidavaalani ||Saagipothunnaanu||

    Gamyam Cheraalani - గమ్యం చేరాలని నీతో ఉండాలని : Lyrics 1201 Gamyam Cheraalani - గమ్యం చేరాలని నీతో ఉండాలని : Lyrics 1201 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.