Kalvarilona Chesina Yaagam - కల్వరిలోన చేసిన యాగం : Lyrics 1167 - Christking - Lyrics

    Kalvarilona Chesina Yaagam - కల్వరిలోన చేసిన యాగం : Lyrics 1167


    కల్వరిలోన చేసిన యాగం
    మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)
    కడిగి వేసెను నాదు పాపం
    నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన||

    ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
    తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
    పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
    నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)
    దైవ సుతుడవే అయిన గాని
    కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన||

    ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
    రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
    నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
    చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2)
    నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
    నన్ను రక్షించుటకు వేదన పడితివి (2) ||కల్వరిలోన||

    సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
    అందించేను నా కొరకై ఆ జీవ జలము
    కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
    నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2)
    అధికారమే లేని మరణము నిలిచెను
    నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2) ||కల్వరిలోన||

    Kalvarilona Chesina Yaagam
    Maranamu Gelichina Nee Yokka Thyaagam (2)
    Kadigi Vesenu Naadu Paapam
    Nilipe Naalo Nee Swaroopam (2) ||Kalvarilona||

    Aa Paapulu Alupe Leka Ninu Kottina Debbalu
    Tholaginche Naapai Unna Aa Ghora Shaapaalu
    Parishuddha Dehamupai Chelaregenu Koradaalu
    Naaloni Rogaalakai Pondithivaa Gaayaalu (2)
    Daiva Suthudave Aina Gaani
    Kanikaramu Veedavu Aela Kshanamainaa Gaani (2) ||Kalvarilona||

    Ae Dosham Leni Deham Mosenu Siluva Bhaaram
    Raddaayenu Naalo Neram Thagginchenu Naa Bhaaram
    Nuvvu Pondina Avamaanam Nanu Unnathi Cherchenu
    Chindinchina Needu Raktham Parishuddhuni Chesenu (2)
    Ninne Baligaa Nuvvu Maarchukuntivi
    Nannu Rakshinchutaku Vedana Padithivi (2) ||Kalvarilona||

    Siluvalo Vrelaaduthu Nuvvu Pondina Daahamu
    Andinchenu Naa Korakai Aa Jeeva Jalamu
    Katinulugaa Maari Neeku Andinchina Aa Chedu
    Nimpenu Naalo Madhuram Tholaginche Naa Kutilam (2)
    Adhikaarame Leni Maranamu Nilichenu
    Ninnu Thaakendunu Anumathi Korenu (2) ||Kalvarilona||

    Kalvarilona Chesina Yaagam - కల్వరిలోన చేసిన యాగం : Lyrics 1167 Kalvarilona Chesina Yaagam - కల్వరిలోన చేసిన యాగం : Lyrics 1167 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.