Krupaa Kshemamu - కృపా క్షేమము నీ : Lyrics 1190 - Christking - Lyrics

    Krupaa Kshemamu - కృపా క్షేమము నీ : Lyrics 1190


    కృపా క్షేమము నీ శాశ్వత జీవము
    నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
    మహోన్నతమైన నీ ఉపకారములు
    తలంచుచు అనుక్షణము పరవశించనా
    నీ కృపలోనే పరవశించనా

    నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
    లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
    అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
    కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
    నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
    నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
    ఆరాధన నీకే ||కృపా క్షేమము||

    నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
    పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
    కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
    గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
    ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
    నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
    ఆరాధన నీకే ||కృపా క్షేమము||

    నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
    నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
    బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
    అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
    ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
    ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
    ఆరాధన నీకే ||కృపా క్షేమము||

    Krupaa Kshemamu Nee Shaashwatha Jeevamu
    Naa Jeevitha Kaalamanthayu Neevu Dayacheyuvaadavu (2)
    Mahonnathamaina Nee Upakaaramulu
    Thalanchuchu Anukshanamu Paravashinchanaa
    Nee Krupalone Paravashinanaa

    Naa Prathi Praarthanaku Neevichchina Eevule
    Lekkaku Minchina Deevenalainaayi (2)
    Adugulu Thadabadaka Nadipinadi Nee Divya Vaakyame
    Kadalini Minchina Vishwaasamunichchi Vijayamu Chekoorchenu (2)
    Nee Vaakyame Makarandamai Balaparachenu Nannu
    Naa Yesayyaa Sthuthipaathruda Aaraadhana Neeke (2)
    Aaraadhana Neeke ||Krupaa Kshemamu||

    Nee Sathya Maargamulo Phalinchina Anubhavime
    Parimalimpajesi Saakshiga Nilipaavu (2)
    Kalatha Chendaka Nilipinadi Nee Divya Darshanamu
    Gamyamu Chere Shakthitho Nanu Nimpi Noothan Krupanichchenu (2)
    Aaraadhyudaa Abhishikthudaa Aaraadhana Neeke
    Naa Yesayyaa Sthuthipaathruda Aaraadhana Neeke (2)
    Aaraadhana Neeke ||Krupaa Kshemamu||

    Naa Praanapriyudaa Nanneelu Mahaaraajaa
    Naa Hrudi Nee Koraku Padilaparachithini (2)
    Boora Shabdamu Vinagaa Naa Brathukulo Kalalu Pandagaa
    Avadhululeni Aanandamutho Nee Kougili Ne Cheranaa (2)
    Aaraadhyudaa Abhishikthudaa Aaraadhana Neeke
    Praaneshwaraa Naa Yesayyaa Aaraadhana Neeke (2)
    Aaraadhana Neeke ||Krupaa Kshemamu||

    Krupaa Kshemamu - కృపా క్షేమము నీ : Lyrics 1190 Krupaa Kshemamu - కృపా క్షేమము నీ : Lyrics 1190 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.