O Kreesthu Sanghamaa - ఓ క్రీస్తు సంఘమా : Lyrics 1142 - Christking - Lyrics

    O Kreesthu Sanghamaa - ఓ క్రీస్తు సంఘమా : Lyrics 1142


    ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
    ప్రభువు నామములో సాగే అనుబంధమా
    ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
    ఓ కంట కన్నీరు తగదు సహవాసమా

    ప్రతి కష్టము మనము పంచుకుందాము
    కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు||

    మనమంతా కలిసి ఆ దేవుని దేహము
    తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)
    ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
    ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము||

    సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
    సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)
    ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
    ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము||

    శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
    విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)
    శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
    పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||

    O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa
    Prabhuvu Naamamulo Saage Anubandhamaa
    O Priya Sanghamaa Yesayya Dehamaa
    O Kanta Kanneeru Thagadu Sahavaasamaa

    Prathi Kashtamu Manamu Panchukundaamu
    Kalisi Andaramu Vedukundaamu (2) ||O Kreesthu||

    Manamanthaa Kalisi Aa Devuni Dehamu
    Thandri Chitthamugaa Erpadina Sanghamu (2)
    Ae Bhaagamu Shrama Padinaa Kaligenu Vedana
    Okkariki Ghanathayinaa Andariki Aadarana (2) ||Prathi Kashtamu||

    Saati Sodarulu Shramala Paalainapudu
    Saathaanu Shakthulache Shodhimpabadinapudu (2)
    Dhairyamunu Nimpaali Vishwaasamu Penchaali
    Edathegaka Praarthinchi Shodhananu Gelavaali (2) ||Prathi Kashtamu||

    Shramalu Pondevaaru Avidheyulu Kaaru
    Vishwaasamu Penchukoni Devunilo Edigeru (2)
    Shaanthamunu Paatinchi Devunilo Veekshinchi
    Panchaali Odaarpu Vadilesi Mana Theerpu (2) ||Prathi Kashtamu||

    O Kreesthu Sanghamaa - ఓ క్రీస్తు సంఘమా : Lyrics 1142 O Kreesthu Sanghamaa - ఓ క్రీస్తు సంఘమా : Lyrics 1142 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.