Devaa Maa Kutumbamu - దేవా మా కుటుంబము : Lyrics 1283 - Christking - Lyrics

    Devaa Maa Kutumbamu - దేవా మా కుటుంబము : Lyrics 1283


    దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)
    ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ
    నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా||

    కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము – మాకేమి దిగులు
    నీకే వందనములయ్యా
    లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము
    లోకాశలు వీడి – లోకంబులోన
    నీ మందగా ఉందుము ||దేవా||

    సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము
    నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు
    ఇమ్మహిలో మాకిమ్మయ్యా
    ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా
    మమ్ములను బలపరచుము ||దేవా||

    ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను
    లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా
    దాచుము నీ చేతులలో
    ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి
    ఫల సంపదలతోను – కలకాలము జీవించ
    కురుపించుము నీ దీవెనలన్ ||దేవా||

    పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్
    నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో
    సంతసంబుగ సాగెదము
    వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము
    కొంత కాలమే మేము – ఉందుము లోకాన
    చెంత చేరగ కోరెదము
    నీ చెంత చేరగ కోరెదము ||దేవా||

    Devaa Maa Kutumbamu – Nee Sevake Ankithamu (2)
    Ee Shaapa Lokaana – Nee Saakshulugaa Niluva
    Nee Aathmatho Nimpumaa (2) ||Devaa||

    Kaapari Maa Yesu Prabhuve – Koduvemi Ledu Maaku
    Maakemi Bhayamu – Maakemi Digulu
    Neeke Vandanamulayyaa
    Lobadi Jeevinthumu – Lopambulu Savarinchumu
    Lokaashalu Veedi – Lokambulona
    Nee Mandagaa Undumu ||Devaa||

    Samruddhi Jeevambunu – Samruddhigaa Maakimmu
    Nemmadi Gala Illu – Nimmalamagu Manassu
    Immahilo Maakimmayyaa
    Immuga Dayachesyumu – Ginne Nindina Anubhavamu
    Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
    Mammulanu Balaparachumu ||Devaa||

    Ae Keedu Raakundagaa – Kaapaadumu Maa Pillalanu
    Loka Duru Vyasanamula – Thaakudu Lekunda
    Daachumu Nee Chethulalo
    Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
    Phala Sampadalathonu – Kalakaalamu Jeevincha
    Kurupinchumu Nee Deevenalan ||Devaa||

    Pempaara Jeyumu Maalo – Sompuga Nee Ghana Preman
    Nimpumaa Hrudayamula – Shaanthi Bhaagyambulatho
    Santhasambuga Saagedamu
    Vinthaina Nee Premanu – Anthata Prakatinthumu
    Kontha Kaalame Memu – Undumu Lokaana
    Chentha Cheraga Koredamu
    Nee Chentha Cheraga Koredamu ||Devaa||

    Devaa Maa Kutumbamu - దేవా మా కుటుంబము : Lyrics 1283 Devaa Maa Kutumbamu - దేవా మా కుటుంబము : Lyrics 1283 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.