Devudu Manaku Ellappudu - దేవుడు మనకు ఎల్లప్పుడు : Lyrics 1285 - Christking - Lyrics

    Devudu Manaku Ellappudu - దేవుడు మనకు ఎల్లప్పుడు : Lyrics 1285


    దేవుడు మనకు ఎల్లప్పుడు
    తోడుగ నున్నాడు (3)

    ఏదేనులో ఆదాముతో నుండెన్
    హానోకు తోడనేగెను
    దీర్ఘ దర్శకులతో నుండెన్
    ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు

    దైవాజ్ఞను శిరసావహించి
    దివ్యముగ నా బ్రాహాము
    కన్న కొమరుని ఖండించుటకు
    ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు

    యోసేపు ద్వేషించ బడినపుడు
    గోతిలో త్రోయబడినపుడు
    శోధనలో చెరసాలయందు
    సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు

    ఎర్ర సముద్రపు తీరమునందు
    ఫరో తరిమిన దినమందు
    యోర్దాను దాటిన దినమందు
    యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు

    దావీదు సింహము నెదిరించి
    ధైర్యాన చీల్చినయపుడు
    గొల్యాతును హతమార్చినయపుడు
    సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు

    సింహపు బోనులో దానియేలు
    షద్రకు మేషా కబేద్నెగో
    అగ్ని గుండములో వేయబడెన్
    నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు

    పౌలు బంధించబడినపుడు
    పేతురు చెరలో నున్నపుడు
    అపోస్తలులు విశ్వాసులు
    హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు

    Devudu Manaku Ellappudu
    Thoduga Nunnaadu (3)

    Aedenulo Aadaamutho Nunden
    Haanoku Thodanegenu
    Deergha Darshakulatho Nunden
    Dhanyulu Devuni Galavaaru – Thoduganunnaadu

    Daivaaznanu Shirasaavahinchi
    Divyamuga Naa Braahaamu
    Kanna Komaruni Khandinchutaku
    Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu

    Yosepu Dweshincha Badinapudu
    Gothilo Throyabadinapudu
    Shodhanalo Cherasaalayandu
    Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu

    Erra Samudrapu Theeramunandu
    Pharo Tharimina Dinamandu
    Yordaanu Daatina Dinamandu
    Yeriko Koolina Dinamandu – Thoduganunnaadu

    Daaveedu Simhamu Nedirinchi
    Dhairyaana Cheelchinayapudu
    Golyaathunu Hathamaarchinayapudu
    Souluche Tharumabadinapudu – Thoduganunnaadu

    Simhapu Bonulo Daaniyelu
    Shadraku Meshaa Kabednego
    Agni Gundamulo Veyabaden
    Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu

    Poulu Bandhinchabadinapudu
    Pethuru Cheralo Nunnapudu
    Aposthalulu Vishwaasulu
    Himsincha Badinayapudu – Thoduganunnaadu

    Devudu Manaku Ellappudu - దేవుడు మనకు ఎల్లప్పుడు : Lyrics 1285 Devudu Manaku Ellappudu - దేవుడు మనకు ఎల్లప్పుడు : Lyrics 1285 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.