Devuni Sthuthincha Randi - దేవుని స్తుతించ రండి : Lyrics 1292 - Christking - Lyrics

    Devuni Sthuthincha Randi - దేవుని స్తుతించ రండి : Lyrics 1292


    దేవుని స్తుతించ రండి
    గత సంవత్సరమున కాపాడెన్
    కీడు మనలను చేరకను – కోటి
    కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని||

    కోట్లకొలది మరణించిరి
    మన మిచ్చట చేరియున్నాము
    కష్టముల బాపి మనల నింక
    జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని||

    ఎన్ని కీడుల మనము చేసిన
    నన్ని మెల్లను చేసెనుగా
    నిరతము కాచి చక్కగాను
    ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని||

    ఏకముగా పాడి హర్షముతో
    లెక్కలేని మేలులకై
    ఆత్మ దేహములను బలిగా
    నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి ||దేవుని||

    వత్సారంభముననిను
    మే మొక్కటిగా నారాధింప
    దైవ కుమారా కృపనిమ్ము
    మా జీవిత కాలమంతయు పాడి – మహా ||దేవుని||

    భూమి యందలి మాయల నుండి
    సైతానుని వలలో నుండి
    ఆత్మతో నిను సేవింప
    నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి ||దేవుని|||

    ప్రతి సంవత్సరమును మము జూడుము
    దుర్గములో మము చేర్చుమయ్యా
    దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి
    ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా ||దేవుని||

    స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
    సకలాశీర్వాదముల నిమ్ము
    ప్రేమతో ప్రభుతో నుండ
    నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు ||దేవుని||

    Devuni Sthuthincha Randi
    Gatha Samvathsaramuna Kaapaaden
    Keedu Manalanu Cherakanu – Koti
    Keedula Nundi Kaapaadinatti – Mahaa ||Devuni||

    Kotlakoladi Maraninchiri
    Mana Michchata Cheriyunnaamu
    Kashtamula Baapi Manala Ninka
    Jagamuna Jeevithuluga Nunchinatti – Mahaa ||Devuni||

    Enni Keedula Manamu Chesina
    Nanni Mellanu Chesenugaa
    Nirathamu Kaachi Chakkaganu
    Prabhu Prematho Kaachinanduna Sthuthichesi ||Devuni||

    Ekamugaa Paadi Harshamutho
    Lekkaleni Melulakai
    Aathma Dehamulanu Baliga
    Nipudesu Karpincheda Mekamugaa – Cheri ||Devuni||

    Vathsaarambhamunaninu
    Me Mokkatigaa Naaraadhimpa
    Daiva Kumaaraa Krupanimmu
    Maa Jeevitha Kaalamanthayu Paadi – Mahaa ||Devuni||

    Bhoomi Yandali Maayala Nundi
    Saithaanuni Valalo Nundi
    Aathmatho Ninu Sevimpa
    Nipu Delumanuchu Brathimaaledamu – Koodi ||Devuni||

    Prathi Samvathsaramunu Mamu Joodumu
    Durgamulo Mamu Cherchumayyaa
    Daatunappudu Nee Sannidhini – Choopi
    Dhairyamunichchi Odaarchumayyaa – Mahaa ||Devuni||

    Sthothrinthumu Prabhuvaa Nee Padamula
    Sakalaasheervaadamula Nimmu
    Prematho Prabhutho Nunda
    Netti Yaapada Leka Brovumaamen – Prabhu ||Devuni||

    Devuni Sthuthincha Randi - దేవుని స్తుతించ రండి : Lyrics 1292 Devuni Sthuthincha Randi - దేవుని స్తుతించ రండి : Lyrics 1292 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.