Devuni Vaarasulam - దేవుని వారసులం : Lyrics 1287 - Christking - Lyrics

    Devuni Vaarasulam - దేవుని వారసులం : Lyrics 1287


    దేవుని వారసులం – ప్రేమ నివాసులము
    జీవన యాత్రికులం – యేసుని దాసులము
    నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
    హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము ||దేవుని||

    సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
    విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
    నిజముగ రక్షణ ప్రబలుటకై
    ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని||

    ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
    విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
    శుభములు గూర్చుచు మాలోన
    శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని||

    దారుణ హింస లలో – దేవుని దూతలుగా
    ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
    మారని ప్రేమ సమర్పణతో
    సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని||

    పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
    పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
    ధరణిలో ప్రభువును జూపుటకై
    సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని||

    అనుదిన కూటములు – అందరి గృహములలో
    ఆనందముతోను – ఆరాధనలాయే
    వీనుల విందగు పాటలతో
    ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని||

    హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
    గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
    భీతులలో బహు రీతులలో
    నూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||

    Devuni Vaarasulam – Prema Nivaasulamu
    Jeevana Yaathrikulam – yesuni Daasulamu
    Nava Yuga Sainikulam – Paraloka Pourulamu
    Hallelooya – Nava Yuga Sainikulam – Paraloka Pourulamu ||Devuni||

    Sajeeva Siluva Prabhu – Samaadhi Geluchutake
    Vijetha Premikulam – Vidheya Bodhakulam
    Nijamuga Rakshana Prabalutakai
    Dhwajamuga Siluvanu Nilupudumu (2) ||Devuni||

    Prabhuvunu Choochutakai Prajalandaru Raagaa
    Vibhu Mahimanu Gaancha – Vishwame Mamu Gola
    Shubhamulu Goorchuchu Maalona
    Shobhillu Yesuni Choopudumu (2) ||Devuni||

    Daaruna Himsalalo – Devuni Doothalugaa
    Aarani Jwaalalalo – Aagani Jayamulatho
    Maarani Prema Samarpanatho
    Sarvathra Yesuni Keertinthumu (2) ||Devuni||

    Parishuddhaathmunikai – Praarthana Salupudamu
    Paramaathmuni Raaka – Balamu Prasaadimpa
    Dharanilo Prabhuvunu Jooputakai
    Sarvaanga Homamu Jeyudamu (2) ||Devuni||

    Anudina Kootamulu – Andari Gruhamulalo
    Aanandamuthonu – Aaraadhanalaaye
    Veenula Vindagu Paatalatho
    Dhyaanamu Cheyuchu Muriyudamu (2) ||Devuni||

    Hatha Saakshula Kaalam – Avanilo Chelarega
    Gathakaalapu Seva – Golgotha Giri Jera
    Bheethulalo Bahu Reethulalo
    Noothana Lokamu Kaankshinthumu (2) ||Devuni||

    Devuni Vaarasulam - దేవుని వారసులం : Lyrics 1287 Devuni Vaarasulam - దేవుని వారసులం : Lyrics 1287 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.