Devuni Sannidhilo - దేవుని సన్నిధిలో : Lyrics 1288 - Christking - Lyrics

    Devuni Sannidhilo - దేవుని సన్నిధిలో : Lyrics 1288


    దేవుని సన్నిధిలో
    ప్రతి రోజు నువ్వు గడిపే సమయం ఎంత
    శోధన సమయంలో
    ఆపవాదిని ఎదురించే ధైర్యం ఎంత (2)
    రాకడ సమయంలో – యేసుని చేరే విశ్వాసం
    ఈ లోకపు పందెంలో నీకున్న సహనమెంత (2)
    ఎంతా ఎంత – శ్రమ ఏదైనా
    నువ్వు కనపరిచే – పోరాటం ఎంతా
    ఎంతా ఎంత – నీ శత్రువు పైనా
    నువ్వు చూపించే – వాత్సల్యం ఎంతా ||దేవుని||

    తన పోలికలోనే నిన్ను నిర్మించాడు
    తన ఏలికలోనే నిన్ను ఊహించాడు (2)
    తన ఆజ్ఞను మీరి – నువ్వు చేసిన పాపాలన్ని
    దేవుని మనసును బాధించిన ఆ గాయం లోతెంత (2)
    ఎంతా ఎంత – పాపివైన
    నిను రక్షించిన – తండ్రి ప్రేమ ఎంత
    ఎంతా ఎంత – ఆ కలువరి సిలువలో
    నీకై కార్చిన – రక్తం విలువెంత ||దేవుని||

    నిను పిలిచినవాడు – ఎంతో నమ్మదగినవాడు
    ఆ పిలుపుకు తగినట్టు – అంతే నమ్మకంగా ఉండు (2)
    ఆత్మల కొరకైన – దేవుని దాహం తీర్చే భారం
    దేవుని సేవలో కొనసాగే నీ ప్రయాసం ఎంత (2)
    ఎంతా ఎంత – స్థితి ఏదైనా
    నువ్వు అర్పించే స్తుతి యాగం ఎంత
    ఎంతా ఎంత – దేవుని పనికై
    నువ్వు చేసే త్యాగం ఎంత ||దేవుని||

    Devuni Sannidhilo
    Prathi Roju Nuvu Gadipe Samayam Entha
    Shodhana Samayamlo
    Apavaadini Edurinche Dhairyam Enthaa (2)
    Raakada Samayamlo – Yesuni Chere Vishwaasam
    Ee Lokapu Pandemlo Neekunna Sahanamentha (2)
    Enthaa Entha – Shrama Edainaa
    Nuvu Kanapariche – Poraatam Entha
    Enthaa Entha – Nee Shathruvu Paina
    Nuvu Choopinche – Vaathsalyam Entha ||Devuni||

    Thana Polikalone Ninnu Nirminchaadu
    Thana Elikalone Ninnu Oohinchaadu (2)
    Thana Aaznanu Meeri – Nuvu Chesina Paapaalanni
    Devuni Manasunu Baadhinchina Aa Gaayam Lothenthaa (2)
    Enthaa Entha – Paapivaina
    Ninu Rakshinchina – Thandri Prema Entha
    Enthaa Entha – Aa Kaluvari Siluvalo
    Neekai Kaarchina – Raktham Viluventha ||Devuni||

    Ninu Pilichinavaadu – Entho Nammadaginavaadu
    Aa Pilupuku Thaginattu – Anthe Nammakamgaa Undu (2)
    Aathmala Korakaina – Devuni Daaham Theerche Bhaaram
    Devuni Sevalo Konasaage Nee Prayaasam Entha (2)
    Enthaa Entha – Sthithi Edainaa
    Nuvu Arpinche Sthuthi Yaagam Entha
    Enthaa Entha – Devuni Panikai
    Nuvu Chese Thyaagam Entha ||Devuni||

    Devuni Sannidhilo - దేవుని సన్నిధిలో : Lyrics 1288 Devuni Sannidhilo - దేవుని సన్నిధిలో : Lyrics 1288 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.