Divinelu Sthothraarhudaa - దివినేలు స్తోత్రార్హుడా : Lyrics 1274 - Christking - Lyrics

    Divinelu Sthothraarhudaa - దివినేలు స్తోత్రార్హుడా : Lyrics 1274


    దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
    దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
    మొదటివాడవు – కడపటివాడవు
    యుగయుగములలో ఉన్నవాడవు (2)

    మానక నా యెడల కృప చూపుచున్నావు
    మారదు నీ ప్రేమ తరతరములకు (2)
    మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
    నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
    నీ మాటలు జీవపు ఊటలు
    నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||

    దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
    దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
    దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
    దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
    నీ దీవెన పరిమళ సువాసన
    నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు||

    సీయోను శిఖరముపై నను నిలుపుటకే
    జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
    దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
    సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
    నీ రాజ్యము పరిశుద్ధ నగరము
    ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||

    Divinelu Sthothraarhudaa Yesayyaa
    Digi Raanaiyunna Maharaajuvu Neevayyaa
    Modativaadavu – Kadapativaadavu
    Yugayugamulalo Unnavaadavu (2)

    Maanaka Naa Yedala Krupa Choopuchunnaavu
    Maaradu Nee Prema Tharatharamulaku (2)
    Maata Thappani Mahaneeyudavu – Maarpuleni Vaadavu
    Neevu Cheppina Manchi Maatalu – Neraverchuvaadavu
    Nee Maatalu Jeevapu Ootalu
    Nee Krupale Balamaina Kotalu (2) ||Divinelu||

    Daachaka Nee Sankalpamu Theliyajeyuchunnaavu
    Dayanondina Nee Janula Mundu Naduchuchunnaavu (2)
    Daati Vellani Karunaamoorthivai – Manavi Aalakinchaavu
    Deergha Shaanthamugalavaadavai – Deevinchuvaadavu
    Nee Deevna Parimala Suvaasana
    Nee Ghanathe Sthiramaina Sampada (2) ||Divinelu||

    Seeyonu Shikharamupai Nanu Niluputake
    Jyeshtula Sanghamugaa Nanu Maarchutake (2)
    Divyamaina Prathyakshathatho – Nannu Nimpiyunnaavu
    Sundaramaina Nee Polikagaa – Roopu Didduchunnaavu
    Nee Raajyamu Parishuddha Nagaramu
    Aa Raajyame Nithya Santhoshamu (2) ||Divinelu||

    Divinelu Sthothraarhudaa - దివినేలు స్తోత్రార్హుడా : Lyrics 1274 Divinelu Sthothraarhudaa - దివినేలు స్తోత్రార్హుడా : Lyrics 1274 Reviewed by Christking on July 04, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.