Naa Korakai Anniyu Chesenu - నా కొరకై అన్నియు చేసెను యేసు : Lyrics 1317 - Christking - Lyrics

    Naa Korakai Anniyu Chesenu - నా కొరకై అన్నియు చేసెను యేసు : Lyrics 1317


    నా కొరకై అన్నియు చేసెను యేసు
    నాకింకా భయము లేదు లోకములో (2)
    నా కొరకై అన్నియు చేసినందులకు (2)
    నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై||

    క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
    క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
    క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
    ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై||

    ఆకాశ పక్షులను గమనించుడి
    విత్తవు అవి పంట కోయవు (2)
    వాటిని పోషించునట్టి పరమ పితా (2)
    మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై||

    ఏమి ధరింతుమని చింతపడకు
    అడవి పువ్వులను తేరి చూడుము (2)
    అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
    తానె – నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై||

    రేపటి దినము గూర్చి చింత పడకు
    ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
    రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
    ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై||

    ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
    పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
    తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
    యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||

    Naa Korakai Anniyu Chesenu Yesu
    Naakinkaa Bhayamu Ledu Lokamulo (2)
    Naa Korakai Anniyu Chesinandulaku (2)
    Nenu – Rakshana Paathranu Etthi Aaraadhinchedan (2) ||Naa Korakai||

    Kshaamamandu Eliyaaku Appamichchenu
    Kshaamam Theerchi Eliyaanu Aasheervadinchen (2)
    Kshaamam Theere Varaku Aa Vidhavaraali (2)
    Inta – Noonekainaa Pindikainaa Korataha Ledu (2) ||Naa Korakai||

    Aakaasha Pakshulanu Gamaninchudi
    Vitthavu Avi Panta Koyavu (2)
    Vaatini Poshinchunatti Parama Pithaa (2)
    Mammu – Anudinam Adbhuthamugaa Nadupunu (2) ||Naa Korakai||

    Emi Dharinthumani Chintha Padaku
    Adavi Puvvulanu Theri Choodumu (2)
    Adavi Puvvula Praabhu Alankarimpa (2)
    Thaane – Nischayamugaa Alankarinchunu (2) ||Naa Korakai||

    Repati Dinamu Goorchi Chintha Padaku
    Aapthudesu Naakunda Bhayamu Enduku (2)
    Repu Daani Sangathulanade Chinthinchun (2)
    Ae – Naati Keedu Aanaatike Ila Chaalunu (2) ||Naa Korakai||

    Aasheervadinchedi Yesu Aranyamulo
    Poshinchenu Aidu Vela Mandini Koodaa (2)
    Theerchunu Prabhuve Prathi Avasarathan (2)
    Yesu – Thannu Thaane Arpinchenu Naa Korakai (2) ||Naa Korakai||

    Naa Korakai Anniyu Chesenu - నా కొరకై అన్నియు చేసెను యేసు : Lyrics 1317 Naa Korakai Anniyu Chesenu - నా కొరకై అన్నియు చేసెను యేసు : Lyrics 1317 Reviewed by Christking on July 07, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.