Naa Praanamaa Yehovaanu - నా ప్రాణమా యెహోవాను : Lyrics 1335 - Christking - Lyrics

    Naa Praanamaa Yehovaanu - నా ప్రాణమా యెహోవాను : Lyrics 1335


    నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము
    నీ ప్రభు చేసిన మేలులలో ఒక్కదానినైన నీవు మరువకు (2)
    అనుదినము ధ్యానించుచు
    కృతజ్ఞతార్పనలు చెల్లించుము (2)

    పాపపు ఊభిలో నీవు మునిగియుండనేల
    నీ దోషములను క్షమియించి లేవనెత్తును
    సమాధిలోన నీవు విసిగియున్న వేళ
    నిను విమోచించి కరుణ కటాక్షముల నిచ్చును (2)
    పక్షిరాజు యవ్వనమును దయచేసి
    మేళ్ళతో నీ హృదయము తృప్తి పరచును
    యేసు నామములోనే నీకు రక్షణ
    యేసు నామములోనే నీకు స్వస్థత
    యేసు నామములోనే నీకు నెమ్మది
    యేసు నామములోనే నిలుపు నీ మది ||నా ప్రాణమా||

    కొండల తట్టు నీ కన్నులెత్తుము
    నీ సహాయము దయచేయు దేవుడు
    ఇరు వైపులా శత్రువు తరుముచున్ననూ
    ఏ అపాయము దరికి చేరనీయడు (2)
    విశ్వాస కవచమును ధరించుము
    విజయ వీరుడవై ముందుకేగుము
    యేసు నామములోనే నీకు విడుదల
    యేసు నామములోనే నీకు క్షేమము
    యేసు నామములోనే నీకు విజయము
    యేసు నామములోనే నిత్యజీవము ||నా ప్రాణమా||

    Naa Praanamaa Yehovaanu Neevu Sannuthinchumu
    Nee Prabhu Chesina Melulalo
    Okkadaaninaina Neevu Maruvaku (2)
    Anudinamu Dhyaaninchuchu
    Kruthagnathaarpanalu Chellinchumu (2)

    Paapapu Oobhilo Neevu Munigiyunda Nela
    Nee Doshamulanu Kshamyinchi Levanethunu
    Samaadhilona Neevu Visigiyunna Vela
    Ninu Vimochinchi Karuna Kataakshamula Nichchunu (2)
    Pakshi Raju Yavvanamunu Dayachesi
    Mellatho Nee Hrudayamu Thrupthi Parachunu
    Yesu Naamamulone Neeku Rakshana
    Yesu Naamamulone Neeku Swasthatha
    Yesu Naamamulone Neeku Nemmadi
    Yesu Naamamulone Nilupu Nee Madi ||Naa Praanamaa||

    Kondala Thattu Nee Kannuleththumu
    Nee Sahaayamu Dayacheyu Devudu
    Iru Vaipula Shathruvu Tharumuchunnanuu
    Ae Apaayamu Dariki Cheraneeyadu (2)
    Vishwaasa Kavachamunu Dharinchumu
    Vijaya Veerudavai Mundukegumu
    Yesu Naamamulone Neeku Vidudala
    Yesu Naamamulone Neeku Kshemamu
    Yesu Naamamulone Neeku Vijayamu
    Yesu Naamamulone NithyaJeevamu ||Naa Praanamaa||

    Naa Praanamaa Yehovaanu - నా ప్రాణమా యెహోవాను : Lyrics 1335 Naa Praanamaa Yehovaanu - నా ప్రాణమా యెహోవాను : Lyrics 1335 Reviewed by Christking on July 13, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.