Koniyaada Tharame Ninnu - కొనియాడ తరమే నిన్ను : Telugu Lyrics - Christking - Lyrics

    Koniyaada Tharame Ninnu - కొనియాడ తరమే నిన్ను : Telugu Lyrics


    కొనియాడ తరమే నిన్ను
    కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను
    తనరారు దినకరు – బెను తారలను మించు (2)
    ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ||

    కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)
    నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ||

    సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)
    నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ||

    విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)
    పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ||

    దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)
    యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ||

    నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)
    చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ||

    ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)
    శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||

    English Lyrics

    Koniyaada Tharame Ninnu
    Komala Hrudaya – Koniyaada Tharame Ninnu
    Thanaraaru Dinakaru – Benu Thaaralanu Minchu (2)
    Ghana Thejamuna Noppu – Kaanthimanthuda Veevu ||Koniyaada||

    Kherubulu Serupulu – Mari Dootha Ganamulu (2)
    Nurutharambuga Goluva – Noppu Shreshtuda Veevu ||Koniyaada||

    Sarva Lokambula – Barvu Devuda Vayyu (2)
    Nurvi Sthree Garbhaana – Nudbhavinchithi Veevu ||Koniyaada||

    Vishwamanthayu Nelu – Veeraasanuda Vayyu (2)
    Pashvaalitho Dotti – Pandiyuntivi Veevu ||Koniyaada||

    Dosambulanu Madiyu – Daasaali Karuninchi (2)
    Yesu Peruna Jagathi – Kegudenchithi Neevu ||Koniyaada||

    Narulayanduna Karuna – Dhara Samaadhaanambu (2)
    Chirakaalamunu Mahima – Paraga Jeyudu Veevu ||Koniyaada||

    O Yesu Paanpuga – Naa Yaathma Jekoni (2)
    Shreyamuga Pavalinchu – Shreekara Varasutha ||Koniyaada||

    Koniyaada Tharame Ninnu - కొనియాడ తరమే నిన్ను : Telugu Lyrics Koniyaada Tharame Ninnu - కొనియాడ తరమే నిన్ను : Telugu Lyrics Reviewed by Christking on September 17, 2017 Rating: 5
    Powered by Blogger.