Raare Mana Yesu Swaamini - రారే మన యేసు స్వామిని : Telugu Lyrics - Christking - Lyrics

    Raare Mana Yesu Swaamini - రారే మన యేసు స్వామిని : Telugu Lyrics


    రారే మన యేసు స్వామిని
    జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని
    గూరిమి భక్తుల జేరువ విందట
    భూరిద యామృత సారము లొలికెడు
    చారు కటాక్ష వి – శాలేక్షనుడట
    నారకులగు నర – నారీ జనులకు
    దారక మొసగను దానే పిలుచునట
    దారుణ పాప మ-హారణ్యమునకు
    గారు చిచ్చు గతి గన్పడువాడట
    ఘోర దరిద్రత గూల్చెడి వాడట
    సారంబగు తన సభకు మకుటమాట ||రారే||
    పతిత పావనమౌ వేల్పట
    అనాది దేవ సుతుడై – ఇల జేరినాడట
    సతతము కడు దురి – తతమోయుతమగు
    ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట
    అతులిత మోక్షో – న్నత గుణగణుడట
    కుతలంబున స-ద్గతి రహితంబగు
    పతితుల గావను – మృతుడైనాడట
    అతి పుణ్య తను – క్షత శోణితమును
    వ్రతముగ సిలువను నతఁడొసంగెనట
    మృతిని జయించుచు బ్రతికి లేచెనట
    మతి నమ్మిన మన గతి యితడేనట ||రారే||

    తుదలేని మహిమ వాడట
    తను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూటట
    చెదరిన గొర్రెల – వెదక వచ్చెనట
    చిదురుపలగు జన హృదయములన్నిట
    బదిలముగా నె-మ్మది నిడువాడట
    నదితట మఠ జన వదనముల స
    మ్మద శుభవార్తను – బలికినవాడట
    సదయత సంధుల – కక్షుల నిడెనట
    వెదకి బధిరులకు – వీనులొసగె నట
    సదమల మోక్ష ప్రభుడగు విభుడట
    యిదిగో మనకిత డేలినవాడట ||రారే||

    English Lyrics

    Raare Mana Yesu Swaamini
    Joothamu Korke – Loora Priyulaaraa Permini
    Goorimi Bhakthula Jeruva Vindata
    Bhoorida Yaamrutha Saaramu Lolikedu
    Chaaru Kataaksha Vi – shaalekshanudata
    Naarakulagu Nara – Naaree Janulaku
    Daaraka Mosaganu Daane Pilachunata
    Daaruna Paapa Ma-haaranyamunaku
    Gaaru Chichchu Gathi Ganpaduvaadata
    Ghora Daridratha Goolchedi Vaadata
    Saarambagu Thana Sabhaku Makutamata ||Raare||
    Pathitha Paavanamou Velpata
    Anaadi Deva Suthudai – Ila Jerinaadata
    Sathathamu Kadu Duri – Thathamoyuthamagu
    Prathi Deshamunaku – Hitha Bhaaskarudata
    Athulitha Moksho – nnatha Gunaganudata
    Kuthalambuna Sa-dgathi Rahithambagu
    Pathithula Gaavanu – Mruthudainaadata
    Athi Punya Thanu – Kshatha Shonithamunu
    Vrathamuga Siluvanu Nathadosangenata
    Mruthini Jayinchuchu Brathiki Lechenata
    Mathi Nammina Mana Gathi Yithadenata ||Raare||

    Thudaleni Mahima Vaadata
    Thanu Golchu Saadhu – Hrudayula Sommu Mootata
    Chedarina Gorrela – Vedaka Vachchenata
    Chidurupalagu Jana Hrudayamulannita
    Badilamugaa Ne-mmadi Niduvaadata
    Nadithata Mata Jana Vadanamula Sa
    mmada Shubhavaarthanu – Balikinavaadata
    Sadayatha Sandhula – Kakshula Nidenata
    Vedaki Badhirulaku – Veenulosage Nata
    Sadamala Moksha Prabhudagu Vibhudata
    Yidigo Manakitha Delinavaadata ||Raare||

    Raare Mana Yesu Swaamini - రారే మన యేసు స్వామిని : Telugu Lyrics Raare Mana Yesu Swaamini - రారే మన యేసు స్వామిని : Telugu Lyrics Reviewed by Christking on September 14, 2017 Rating: 5
    Powered by Blogger.