Nee Swaramu - నీ స్వరము వినిపించు : Telugu Lyrics - Christking - Lyrics

    Nee Swaramu - నీ స్వరము వినిపించు : Telugu Lyrics


    నీ స్వరము వినిపించు ప్రభువా
    నీ దాసుడాలకించున్ (2)
    నీ వాక్యమును నేర్పించు
    దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||

    ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
    నాకు ఎంతో మధురము
    దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
    రక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము||

    నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
    నేను సరి చేసికొందు
    నీ మార్గములో – నడుచునట్లుగా
    నేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము||

    భయ భీతులలో – తుఫానులలో
    నీ స్వరము వినిపించుము
    అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా
    ధైర్య పరచుము నన్ను – (2) ||నీ స్వరము||

    నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా
    నీ స్వరము నా కొరకే
    నీతో మనుష్యులతో – సరిచేసికొందు
    నీ దివ్య వాక్యము ద్వారా – (2) ||నీ స్వరము||

    నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా
    నీ వాక్యమును ఎంతో
    నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో
    నీ యందు నిలచునట్లు – (2) ||నీ స్వరము||

    నా హృదయములోని – చెడు తలంపులను
    చేధించు నీ వాక్యము
    నీ రూపమునకు – మార్చుము నన్ను
    నీదు మహిమ కొరకేగా – (2) ||నీ స్వరము||

    English Lyrics

    Nee Swaramu Vinipinchu Prabhuvaa
    Nee Dhaasudaalakinchun (2)
    Nee Vaakyamunu Nerpinchu
    Daaniyandu Naduchunatlu Neetho ||Nee Swaramu||

    Udayamune Lechi – Nee Swaramu Vinuta
    Naaku Entho Madhuramu
    Dinamanthati Koraku – Nanu Siddhaparachu
    Rakshinchu Aapadalanundi – (2) ||Nee Swaramu||

    Nee Vaakyamu Chadivi – Nee Swaramu Vinuchu
    Nenu Sari Chesikondu
    Nee Maargamulo – Naduchunatlugaa
    Nerpinchumu Ellappudu – (2) ||Nee Swaramu||

    Bhaya Bheethulalo – Thuphaanulalo
    Nee Swaramu Vinipinchumu
    Abhayamu Nimmu – O Goppa Devaa
    Dhairya Parachumu Nannu – (2) ||Nee Swaramu||

    Naatho Maatlaadu – Spashtamugaa Prabhuvaa
    Nee Swaramu Naa Korake
    Neetho Manushyulatho – Sarichesikondu
    Nee Divya Vaakyamu Dvaaraa – (2) ||Nee Swaramu||

    Nerchukunnaanu – Naa Shramala Dvaaraa
    Nee Vaakyamunu Entho
    Nannunchumu Prabhuvaa – Nee Vishwaasyathalo
    Nee Yandu Nilachunatlu – (2) ||Nee Swaramu||

    Naa Hrudayamuloni – Chedu Thalampulanu
    Chedhinchu Nee Vaakyamu
    Nee Roopamunaku – Maarchumu Nannu
    Needu Mahima Korakegaa – (2) ||Nee Swaramu||

    Nee Swaramu - నీ స్వరము వినిపించు : Telugu Lyrics Nee Swaramu - నీ స్వరము వినిపించు : Telugu Lyrics Reviewed by Christking on October 02, 2017 Rating: 5
    Powered by Blogger.