Ae Chettu Gutta Putta - ఏ చెట్టు గుట్ట పుట్ట మట్ | B Sangeetha Rao - Christking - Lyrics

    Ae Chettu Gutta Putta - ఏ చెట్టు గుట్ట పుట్ట మట్ | B Sangeetha Rao


    ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా
    ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2)
    యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు||

    పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను
    గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను
    నరుల పాపము తన భుజాలపై
    మోపుకొనెను పరమ దేవుడు (2)
    నమ్మిన వారై రక్షణ పొంద
    స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు||

    మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను
    సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను
    యేసు లేచెను మరణము గెలిచి
    నమ్మిన వారిని పరమును చేర్చ (2)
    హల్లెలూయా ఆనందమే
    హల్లెలూయా సంతోషమే (2) ||ఏ చెట్టు||

    Ae Chettu Gutta Putta Matti Mokshyamuneeyadayyaa
    Ae Raayi Rappa Devullanthaa Maargamu Chooparayyaa (2)
    Yese Nija Devudu – Paapula Rakshinchunu (2) ||Ae Chettu||

    Paapamanthayu Tholagimpanu – Daivame Digi Vachchenu
    Gorrepillagaa Thala Vanchenu – Praanamune Arpinchenu
    Narula Paapamu Thana Bhujaalapai
    Mopukonenu Parama Devudu (2)
    Nammina Vaarai Rakshana Ponda
    Swargaanike Cherukundamaa (2) ||Ae Chettu||

    Mahima Roopude Manishi Janmalo – Bhuviki Avatharinchenu
    Siluva Mraanupai Vrelaadenu – Rakthamu Chindinchenu
    Yesu Lechenu Maranamu Gelichi
    Nammina Vaarini Paramunu Chercha (2)
    Hallelooyaa Aanandame
    Hallelooyaa Santhoshame (2) ||Ae Chettu||
    Ae Chettu Gutta Putta - ఏ చెట్టు గుట్ట పుట్ట మట్ | B Sangeetha Rao Ae Chettu Gutta Putta - ఏ చెట్టు గుట్ట పుట్ట మట్ | B Sangeetha Rao Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.