Gorrepilla Vivaahotsava - గొర్రెపిల్ల వివాహోత్సవ : Lyrics 1211 - Christking - Lyrics

    Gorrepilla Vivaahotsava - గొర్రెపిల్ల వివాహోత్సవ : Lyrics 1211


    గొర్రెపిల్ల వివాహోత్సవ
    సమయము వచ్చెను రండి (2)

    సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)
    మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||

    సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)
    నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

    పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)
    గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||

    తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
    నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||

    దేవుని వాక్యమను నామము గలవాడు (2)
    రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||

    ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)
    పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

    శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)
    వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||

    Gorrepilla Vivaahotsava
    Samayamu Vachchenu Randi (2)

    Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
    Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||

    Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
    Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||

    Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
    Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||

    Thellani Gurramupai Koorchundinavaadu (2)
    Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||

    Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
    Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||

    Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
    Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||

    Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
    Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||

    Gorrepilla Vivaahotsava - గొర్రెపిల్ల వివాహోత్సవ : Lyrics 1211 Gorrepilla Vivaahotsava - గొర్రెపిల్ల వివాహోత్సవ : Lyrics 1211 Reviewed by Christking on June 23, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.