Devuniki Sthothramu Gaanamu - దేవునికి స్తోత్రము గానము : Lyrics 1294 - Christking - Lyrics

    Devuniki Sthothramu Gaanamu - దేవునికి స్తోత్రము గానము : Lyrics 1294


    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

    యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
    ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||

    గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||

    నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
    వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||

    ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||

    దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
    సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||

    ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
    భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||

    పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
    అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||

    గుర్రముల నరులందలి బలము నానందించడు
    కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||

    యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
    కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||

    పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
    మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||

    భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
    వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||

    వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
    ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||

    Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
    Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi

    Yerushalemu Yehovaye Kattuchunnavaadani
    Ishrayeleeyulanu Pogucheyuvaadani ||Devuniki||

    Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
    Vaari Gaayamulanniyu Kattuchunnavaadani ||Devuniki||

    Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
    Vaatikanniyu Perulu Pettuchunnavaadani ||Devuniki||

    Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
    Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani ||Devuniki||

    Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
    Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi ||Devuniki||

    Aayana Aakaashamun Meghamulatho Kappunu
    Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani ||Devuniki||

    Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
    Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu ||Devuniki||

    Gurramula Narulandali Balamu Naanandinchadu
    Krupa Vedu Vaarilo Santhasinchuvaadani ||Devuniki||

    Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
    Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani ||Devuniki||

    Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
    Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu ||Devuniki||

    Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
    Vegamugamu Devuni Vaakyamu Parugeththunu ||Devuniki||

    Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
    Ae Janamukeelaaguna Chesiyundaledani ||Devuniki||

    Devuniki Sthothramu Gaanamu - దేవునికి స్తోత్రము గానము : Lyrics 1294 Devuniki Sthothramu Gaanamu - దేవునికి స్తోత్రము గానము : Lyrics 1294 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.