Parishuddhame Yesuni Raktham | Philip gariki | Sharon sisters - Christking - Lyrics

    Parishuddhame Yesuni Raktham | Philip gariki | Sharon sisters



    పరిశుద్ధమే యేసుని రక్తం - ప్రవహించెను కల్వరిలో
    కడుగబడుము పావన రక్తం - ప్రభుయేసునే ఆరాధించు

    సూరూపమైనను సొగసైననులేదు - తృణీకరింపబడెను
    విసర్జించిరి మనుజులెల్లరును - దైవమె చేయి వీడెను
    పదివేలలోన అతిసుందరుండు - రూపునే కోల్పోయెను

    వ్యసనాక్రాంతుడుగా వ్యాధిగ్రస్థునిగా - కనిపించే నా ప్రియుడు
    మనము చూడనొల్లని స్వరూపుడాయె - మనమెన్నిక చేయలేదు
    పదివేలలోన అతి శ్రేష్ఠనీయుడు - హీనునిగా చేయబడెను

    మన రోగములను భరియించె ప్రభువే - నిశ్చయముగా ఆ సిల్వపై
    మన వ్యసనములన్ని వహియించినతడే - దేవుని వధ గొర్రెపిల్లయి
    పదివేలలోన అతిపరిశుద్ధున్డు - పాపముగా చేయబడెను

    మన దోషములకై గాయములనొంది - స్వస్థతనిచ్చే ప్రియుడై
    మన సమాధానార్థమైన శిక్ష భరియించె - నలుగగొట్టబడెను
    పదివేలలోన అతిమహాఘనుడు - రక్తపుముద్దాయెను

    బాధింపబడిన మౌనియైయుండెను - నోరుతెరువడాయెను
    అన్యాయపుతీర్పు నొందినవాడై - బలియాయేనాసిల్వలో
    పదివేలలోన అతికాంక్షణీయుడు - ద్వేషింపబడికూలెను


    English


    Parishuddhame Yesuni Raktham | Philip gariki | Sharon sisters Parishuddhame Yesuni Raktham | Philip gariki | Sharon sisters Reviewed by Christking on April 13, 2020 Rating: 5

    No comments:

    Powered by Blogger.