Jeevamu Gala Devuni Sangham - జీవము గల దేవుని సంఘ - Christking - Lyrics

    Jeevamu Gala Devuni Sangham - జీవము గల దేవుని సంఘ


    జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
    మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
    సంకల్పమందున మనముండినా
    ఆ సంఘమందున వసియించినా
    ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము||

    యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
    సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)
    పాతాళలోక ద్వారములు
    దాని ఎదుట నిలువవు (2) ||జీవము||

    యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము
    పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2)
    ఏ నరుడు దేవుని నిలయమును
    పాడు చేయకూడదు (2) ||జీవము||

    యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
    సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2)
    ప్రభు యేసు దివ్య మాదిరిలో
    గమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము||

    ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
    శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2)
    లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
    లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం ||జీవము||

    Jeevamu Gala Devuni Sangham – Entho Entho Ramyamu
    Manakai Devuni Sankalpam – Entho Entho Sreshtamu
    Sankalpamanduna Manamundinaa – Aa Sanghamanduna
    Vasiyinchinaa Entho Entho Dhanyamu

    Yese Swarakthamichchi Sampaadinchina Sanghamu
    Sathyamunaku Sthambhamunu Aadhaaramunaiyunnadi (2)
    Paathaala Loka Dwaaramulu
    Daani Eduta Niluvavu (2) ||Jeevamu||

    Yese Shirassai Yunna – Shareeramu Manamandaramu
    Parishuddhaathma Manalo Nivasinchuchunnaadu (2)
    Ae Narudu Devuni Nilayamunu
    Paadu Cheyakoodadu (2) ||Jeevamu||

    Yavvana Praayamu Manalo – Bhavyaaniki Bhayapadaka
    Savvadi Cheyuchu Niratham – Kavvinchu Chundunu (2)
    Prabhu Yesu Divya Maadirilo
    Gamyamu Cheragaa Saagudaam (2) ||Jeevamu||

    Ae Praantheeyulamaina – Manamandaramu Sodarulam
    Shaashwatha Raajyapu Gurilo – Shree Yesuni Saha Vaarasulam (2)
    Lokaana Yesuni Thyaagamunu – Saahasamutho Chaatudaam
    Lokaana Kreesthuni Mahimanu – Sahanamuthone Chaatudaam ||Jeevamu||
    Jeevamu Gala Devuni Sangham - జీవము గల దేవుని సంఘ Jeevamu Gala Devuni Sangham - జీవము గల దేవుని సంఘ Reviewed by Christking on March 16, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.