Enno Enno Melulu Chesaavayyaa - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా : Lyrics 1101 - Christking - Lyrics

    Enno Enno Melulu Chesaavayyaa - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా : Lyrics 1101


    ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
    నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
    హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||

    బాధలలో మంచి బంధువువైనావు
    వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
    చీకటి బ్రతుకులో దీపము నీవై
    పాపములన్నియు కడిగిన దేవా (2)
    నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
    నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||

    శోధనలో సొంత రక్షకుడైనావు
    శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
    హృదయ వేదన తొలగించినావు
    కృపా క్షేమముతో నడిపించినావు (2)
    నా కోసం భువికొచ్చిన దైవ మానవా
    నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||

    Enno Enno Melulu Chesaavayyaa
    Ninne Ninne Sthuthiyinthunu Yesayyaa (2)
    Hallelooya Hallelooya
    Hallelooya Hallelooya (2) ||Enno||

    Baadhalalo Manchi Bandhuvuvainaavu
    Vyaadhulalo Parama Vaidyudavainaavu (2)
    Cheekati Brathukulo Deepamu Neevai
    Paapamulanniyu Kadigina Devaa (2)
    Naa Hrudilo Udayinchina Neethi Sooryudaa
    Ne Brathuku Dinamulella Ninnu Vededaa (2) ||Enno||

    Shodhanalo Sontha Rakshakudainaavu
    Sreshta Prema Choopu Snehithudainaavu (2)
    Hrudaya Vedana Tholaginchinaavu
    Krupaa Kshemamutho Nadipinchinaavu (2)
    Naa Kosam Bhuvikochchina Daiva Maanavaa
    Naa Brathuku Dinamulella Ninnu Vededaa (2) ||Enno||

    Enno Enno Melulu Chesaavayyaa - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా : Lyrics 1101 Enno Enno Melulu Chesaavayyaa - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా : Lyrics 1101 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.