Idigo Deva Naa Jeevitham - ఇదిగో దేవా నా జీవితం : Lyrics 1072 - Christking - Lyrics

    Idigo Deva Naa Jeevitham - ఇదిగో దేవా నా జీవితం : Lyrics 1072


    ఇదిగో దేవా నా జీవితం
    ఆపాదమస్తకం నీకంకితం (2)
    శరణం నీ చరణం (4) ||ఇదిగో||

    పలుమార్లు వైదొలగినాను
    పరలోక దర్శనమునుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు
    నే తగినట్లు జీవించనైతి (2)
    అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు
    అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో||

    నీ పాదముల చెంత చేరి
    నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి
    ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
    ఆగిపోక సాగిపోవు
    ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
    ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||

    Idigo Deva Naa Jeevitham
    Aapaadamasthakam Neekankitham (2)
    Sharanam Nee Charanam (4) ||Idigo||

    Palumaarlu Vaidolaginaanu
    Paraloka Darshanamunundi
    Viluvaina Nee Divya Pilupuku
    Ne Thaginatlu Jeevinchanaithi (2)
    Ainaa Nee Prematho
    Nannu Dari Cherchinaavu
    Anduke Gaikonumu Devaa
    Ee Naa Shesha Jeevitham ||Idigo||

    Nee Paadamula Chentha Cheri
    Nee Chiththambu Neneruga Nerpu
    Nee Hrudaya Bhaarambu Nosagi
    Praarthinchi Panicheyanimmu (2)
    Aagipoka Saagipovu
    Priyasuthuniga Panicheyanimmu
    Prathi Chotha Nee Saakshigaa
    Prabhuvaa Nannundanimmu ||Idigo||

    Idigo Deva Naa Jeevitham - ఇదిగో దేవా నా జీవితం : Lyrics 1072 Idigo Deva Naa Jeevitham - ఇదిగో దేవా నా జీవితం : Lyrics 1072 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    1 comment:

    1. ఇదిగో దేవా నా జీవితం is written some 25 years back by Y.Babji when he was a student in Agricultural University. He is associated with UESI. I was one among the students learnt this song when Babji taught us by singing. He composed the lyrics and tune too. The song was published in Vidyarthi Geethavali of UESI. Hence I request you to acknowledge him wherever you find the song. Further, it is not ప్రియ సుతునిగా...it is ప్రేషితుని గా....నశించు ఆత్మలన్ దగ్గర నశియించు విద్యార్థులన్.

      ReplyDelete

    Powered by Blogger.